Intensive Care Unit
-
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిలకడగా ఏచూరి ఆరోగ్యం: సీపీఎం
న్యూఢిల్లీ: సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సీపీఎం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో కామ్రెడ్ సీతారాం ఏచూరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందుతోంది. సానుకూల స్పందన కనిపిస్తోంది. కామ్రెడ్ సీతారాం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాతీలో న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆగస్ట్ 19వ తేదీన ఆన ఎయిమ్స్‌లో చేరారు. -
నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు. -
ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మంత్రి విశ్వరూప్
సాక్షి, అమలాపురం టౌన్: ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రిలో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ను ఐసీయూ నుంచి సాధారణ వైద్యానికి స్పెషల్ రూమ్‌కు గురువారం సాయంత్రం మార్చారు. ఈ విషయాన్ని ముంబై నుంచి మంత్రి కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. చదవండి: (AP Govt: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్) -
ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం..
న్యూఢిల్లీ: అనారోగ్యంతో బాధపడుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగుకు సర్జరీ అనంతరం పర్యవేక్షణ నిమిత్తం అతన్ని ఐసీయూలో ఉంచారు. అయితే, ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని, కీలక అవయవాలన్నీ మెరుగ్గా పని చేస్తున్నాయని, ఆయన ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారుని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. తన ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందంటూ పీలే తన ఇన్‌స్టా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా గత నెలలో ఆసుపత్రికి వెళ్లగా.. పెద్దపేగులో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని వెంటనే సర్జరీ ద్వారా తొలగించాలని తెలిపారు. రొటీన్ కార్డియోవాస్కులర్, లాబోరేటరీ పరీక్షల్లో భాగంగా ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. ఇక క్లబ్ ఫుట్‌బాల్ విషయానికొస్తే.. ఈ పోటీల్లో సైతం అత్యధిక గోల్స్ రికార్డు పీలే పేరిటే ఉండేది. ఈ రికార్డును అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ గతేడాదే బ్రేక్ చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్ చేయగా, 2004 నుంచి 2020 వరకు బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ.. 17 సీజన్ల పాటు ఆడి 749 మ్యాచ్‌ల్లో 644 గోల్స్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. చదవండి: టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం -
ఐసీయూలో ఆస్కార్ ఫెర్నాండెజ్
యశవంతపుర: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆదివారం మంగళూరు లోని అత్తావరలోని నివాసంలో యోగా చేస్తుండగా జారి పడడంతో తలకు దెబ్బ తగిలింది. ఏమీ కాలేదని పట్టించుకోలేదు. అయితే అదేరోజు సాయంత్రం ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా తల లోపల బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు తక్షణం శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యమందిస్తున్నారు. -
'ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది'
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): కరోనా రోగులతో ఆసుపత్రి నిండిపోయింది.. ఇంకా బయటి నుంచి వస్తూనే ఉన్నారు. వైద్యులు, సిబ్బంది క్షణం తీరికలేకుండా సేవలు చేయడంలో మునిగిపోయారు.. ఆక్సిజన్ సకాలంలో అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఉదంతం ఇంకా మరవలేదు.. అంతలోనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలోకి వచ్చి హల్చల్ సృష్టించారు. వైద్యులను, సిబ్బందిని హడలెత్తించారు. చివరికి పోలీసులకు చిక్కి రిమాండ్ పాలయ్యారు. అసలు విషయమేమిటంటే... తస్కీన్, అమరేందర్ అనే ఇద్దరు వ్యక్తులు యూనిట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ (ఎన్సీఐడీ) పేరిట ఇన్వెస్టిగేషన్ అధికారులుగా అవతారమెత్తారు. ఆదివారం ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఘటనను ‘సుమోటోగా స్వీకరించిన’వీళ్లు రెండు రోజులు ఆలస్యంగా మంగళవారం సాయంత్రం ఆ దవాఖాన వద్దకు వచ్చారు. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్..? ఫ్లోర్ ఇన్చార్జ్ షాహీదా వద్దకు వెళ్లి ఆక్సిజన్ ప్లాంట్‌కు దారి అడిగారు. ‘వీ ఆర్ ఫ్రం ఎన్సీఐడీ. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్ ఛాంబర్ అండ్ వేర్ ఈజ్ ఆక్సిజన్ ప్లాంట్’ అంటూ గద్దించారు. వీళ్లు నిజమైన సీఐడీ అధికారులుగా భావించిన ఆమె ప్లాంట్‌కు దారి చూపించారు. వారు తమ ఫోన్లతో అక్కడ ఫొటోలు, వీడియోలు తీశారు. అక్కడ నుంచి రిసెప్షన్ వద్దకు రాగా... అదే సమ యంలో ఓ మహిళా కోవిడ్ రోగి అడ్మిషన్ కోసం వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం రోగి రక్తంలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతేనే అడ్మిషన్ ఇవ్వాలి. ఆ మహిళలకు 85 శాతం ఉండటంతో ఆసుపత్రిలో చేర్చుకోవడం కుదరదంటూ సిబ్బంది చెప్పారు. ఇది చూసిన ఈ ఎన్సీఐడీ ద్వయం రెచ్చిపోయింది. అసలు ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది, ప్రతి చోటా లంచం తీసుకుం టున్నారు, డబ్బు ఇవ్వకపోతే అడ్మిట్ చేసుకోవట్లేదు.. అంటూ ఆరోపణలు చేసింది. ఐసీయూలో వైద్యురాలికి బెదిరింపు.. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు ఐసీయూలోకి దూసుకుపోయి ఫొటోలు, వీడియోలు తీయడం మొదలెట్టారు.. అక్కడ విధుల్లో ఉన్న ఓ వైద్యురాలు వీరిని గమనించి ‘ఎవరండీ మీరు.. ఐసీయూలోకి ఎందుకు వచ్చారు? అంటూ ప్రశ్నించగా.. ‘ఎవతివే నువ్వు? ఉద్యోగం చెయ్యాలని ఉందా లేదా’అంటూ ఆమెపై రంకెలు వేశారు. మా సంగతి మీకు తెలీదంటూ బెదిరింపు.. ఈ హైడ్రామాతో దాదాపు రెండు గంటలపాటు వైద్యులు, సిబ్బంది హడలిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆఫీసర్ విజయేంద్ర బోయి అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయనతోపాటు నారాయణగూడ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూశాక కూడా ఆ ఇద్దరూ ‘మా సంగతి మీకు తెలీదు, మేం తలచుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఉద్యోగాలు చేయ్యలేరంటూ’బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించి విచారించగా ఎన్సీఐడీకి సంబంధించిన అసలు విషయం బయటపడింది. వైద్యులను దూషించినందుకు, దౌర్జన్యానికి దిగినందుకు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హల్చల్ చేస్తున్న సమయంలో వీరి వెంట ఉన్నది ఎవరు? వీరితో సంబంధాలు ఏంటి? అనే అంశాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ద్వయం గతంలోనూ ఇలాంటి బెదిరింపుల దందాలు చేసిందా? అనేది ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ పోలీసుల లేఖ నారాయణగూడ పోలీసులు ఇరువురినీ అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ద్వయం గతంలోనే తమ సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు వీరి వ్యవహారశైలిని వివరిస్తూ, రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అయితే హల్చల్ చేయడానికి వారు ఇలా యూసీఐడీలుగా అవతారమెత్తారని, ఇక్కడ ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అసలు వీరెవరంటే... డబీర్పురకుచెందిన మహ్మద్ తస్కీన్ ఆలిండియా సీనియర్ స్పెషల్ ఆఫీసర్, ప్రెసిడెంట్‌గా, మెట్టుగూడ వాసి అమరేందర్ సెక్రటరీగా యూసీఐడీ సంస్థను ఏ ర్పాటు చేశారు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు పంపిన దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈలోపే విజిటింగ్ కార్డులు ముద్రించుకు న్న ఈ ద్వయం రోడ్లపైకి ఎక్కింది. ఇందు లో యూనిట్ అనే పదాన్ని చిన్నగా... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్‌ను పెద్దగా ఎర్ర అక్షరాలతో ముద్రించారు. అందులోనే వర్కింగ్ ఎగైనెస్ట్ క్రైమ్ అని రాశారు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది అట్నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఛాంబర్‌కు వీళ్లిద్దరూ వెళ్లారు. ఆ సమయంలో ఛాంబర్లో నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా, ఆర్ఎంవో నీరజ ఉన్నారు. వారిని చూస్తూ రెచ్చిపోయిన ఎన్సీఐడీ ప్రెసిడెంట్, సెక్రటరీలు ‘ఆదివారం ఆక్సిజన్ అందక రోగులు ఎందు కు చనిపోవాల్సి వచ్చింది? ఆక్సిజన్ పూర్త య్యే వరకు మీరేం చేస్తున్నారు?’అంటూ చిందులేశారు. అక్కడున్న అధికారులు ‘మీరు ఎవరు?’అంటూ వీరిని ప్రశ్నించారు. దీంతో ‘ఏం సూపరింటెండెంట్.. నన్నే అడుగుతావా? నేను ఎవర్ని అనుకుంటున్నావ్. ఈటల రాజేందర్ లాంటి వాడినే మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది. మైండ్ యువర్ వర్డ్స్.. నీ అంతుచూస్తా’అంటూ వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. -
కరోనా: ముంబైలో 99% ఐసీయూలు ఫుల్
ముంబై : భారత్‌లో కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలో ఆ సంఖ్య లక్ష దాటింది. అదే విధంగా దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో ఇప్పటి వరకు 55,000 వేల కేసులు వెలుగు చూడగా.. 2,044 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 1,366 కొత్త కేసులు నమోదవ్వగా.. 90 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వరకు 28,163 యాక్టివ్ కేసులు ఉండగా, 25,152 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ముంబైలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో వైద్య మౌలిక సదుపాయాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఎమ్మెల్యే భార్యతో పాటు మరో ముగ్గురికి కరోనా) ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయూ) విషయానికొస్తే ముంబైలో 99 శాతం మేర నిండిపోయాయి. అంతేగాక నగరంలో 94 శాతం వెంటిలేటర్లు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శనివారం పేర్కొంది. జూన్ 11 నాటికి ముంబై నగరంలో ఐసీయూలో మొత్తం 1.181 పడకలు ఉంటే వాటిలో 1, 167 పడకలు ఇప్పటికే ఆక్రమించాయి. కేవలం 14 పడకలు మాత్రమే కొత్తగా చేరే పేషెంట్ల కోసం మిగిలి ఉన్నాయి. అలాగే 530 వెంటిలేటర్లలలో 497 ఉన్నాయి. 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 (76 శాతం) వాడుకలో ఉన్నట్లు బీఎంసీ తెలిపింది. కాగా నగరమంతా ఉన్న కోవిడ్ హాస్పిటల్స్, కోవిడ్ హెల్త్ సెంటర్లలలో 10,450 పడకలు ఉండగా, వీటిలో 9,098 పడకలు (87 శాతం) నిండిపోయాయి. అయితే కేసులు పెరుగుతన్నప్పటికీ అందుబాటులో ఉండే పడకల సంఖ్య కూడా పెంచుతున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. (కరోనా: రోగుల పేర్లు ఒకేలా ఉండటంతో...) -
కష్టాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు చెల్లు !
♦ వాటిని వీలైనంత త్వరగా అమ్మేయాల్సిందే... ♦ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్య ముంబై: మొండి బకాయిల (ఎన్పీఏ) భారంతో కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మేయాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సూచించారు. ‘‘భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్ర మొండిబకాయిల భారంలో ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’(ఐసీయూ)లో ఉన్నాయి. వీటిని ప్రైవేటు బ్యాంకులకు అమ్మివేయచ్చు. మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న ఆయా బ్యాంకులు ఇందుకు సంబంధించి తమ పరిస్థితిని మెరుగుపరచుకోడానికి, తాజా మూలధనం సమీకరించుకోడానికి సమయం మించిపోతుంది’’ అని అన్నారు. 8వ ఆర్కే తల్వార్ స్మారకోపన్యాసం చేసిన ఆయన ఈ సందర్భంగా ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుత్తేజం– అసంపూర్ణ అజెండా’ అన్న అంశంపై మాట్లాడారు. న్యూయార్క్ యూనివర్శిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ అయిన ఆచార్య ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత్‌కు ఒక ‘సుదర్శన చక్రం’ కావాల్సిందే. సామర్థ్యం పెంపునకు బ్యాంకులు చేపడుతున్న చర్యలు పూర్తి మందగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కరించడంలో కాలాతీతం అయిపోతోంది. దీనితో రుణాలకు అధికభాగం వీటిమీదే ఆధారపడుతున్న చిన్న తరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ఇంద్రధనుష్ కార్యక్రమం (నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా రూ.70,000 కోట్ల అందజేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్రం ప్రకటించింది) మంచిదే. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సత్వర సమస్య పరిష్కారానికి ఇంకా శక్తివంతమైన ‘సుదర్శన’ చక్రం వంటి ప్రణాళిక అవసరం. ‘ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే, ప్రైవేటు క్యాపిటల్ ప్రొవైడర్స్‌కు కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మివేయవచ్చా? తద్వారా ఆయా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో అమలు జరుగుతున్న ‘తగిన దిద్దుబాటు చర్యల (పీఏసీ)’తో ఐసీయూలో నుంచి పటిష్ట వంతమైన వ్యవస్థలోకి మారే వీలుంటుందా? ఈ ప్రశ్నలకు తగిన సమాధానాన్ని చిన్న బ్యాంకులతో రాబట్టే వీలుంటుందా?’ అని ఆచార్య ఈ సందర్బంగా ప్రశ్నించారు. బ్యాంకులకు రెండో విడత ‘దివాలా’ జాబితా మొండిబకాయిల ఖాతాలకు సంబంధించి బ్యాంకులకు తాజాగా రెండో జాబితాను పంపించినట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ధ్రువీకరించారు. దివాలా కోడ్‌లోని నిబంధనలను మార్చామని, మొండిబకాయిల విషయంలో వీటిని విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంకులను కోరినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇతర ఖాతాలను పరిష్కరించుకోవాలని కూడా సూచించినట్టు తెలిపారు. ఒకవేళ నిర్దేశించిన సమయంలోపు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడంలో విఫలమైతే ఆయా కేసులను సైతం బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలకు సిఫారసు చేస్తామని విరాల్æ వివరించారు. ఆర్బీఐ తొలిసారిగా 12 భారీ రుణ ఎగవేత కేసుల్లో ఐబీసీ కింద చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల మరో 40 కేసులతో రెండో జాబితాను బ్యాంకులకు పంపినట్టు వార్తలు వచ్చాయి. కానీ, విరాల్ ఆచార్య మాత్రం ఈ సంఖ్య గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఐబీసీ కింద కేసులు ఫైల్ చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశించడం వాణిజ్య నిర్ణయంలో భాగమేనన్నారు. నిరర్థక ఆస్తులను ఏరిపారేయడానికి బ్యాంకులు ఐబీసీని మరింతగా వాడుకోవాలన్నారు. దివాలా చర్యలను తమంతట తామే చేపట్టాలని, ఆర్బీఐ అనుమతి కోసం వేచి చూడరాదని సూచించారు. ఎన్పీఏలు రెండంకెలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉందని, రుణ వృద్ధి కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. -
ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో గార్బాడ్యాన్స్
-
‘ఐసీయూ’లో ఆస్పత్రులు
తక్షణ వైద్య సదుపాయం లేక అల్లాడుతున్న రోగులు వెంటిలేటర్లు అందించాలని ప్రభుత్వానికి వైద్యవిద్యా శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యానికి గురై విషమ స్థితిలో ఉన్న రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరుస్తారు. రాష్ట్రంలో మాత్రం జబ్బుపడ్డ వారు కాకుండా ఆస్పత్రులే వసతులు లేక ఐసీయూకి తరలించే స్థితికి చేరుకున్నాయి. ఏ ఆస్పత్రిలో చూసినా వెంటిలేటర్ల కొరతతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేదంటే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిందే. ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూల కోసం కేంద్రం నిధులు తీసుకొచ్చైనా ఏర్పాట్లు చేయాలని వైద్యవిద్యాశాఖ సంచాలకులు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. 2014-15కి కేంద్రం ఇప్పటికే రూ.46 కోట్లు కేటాయించిందని, అదనపు నిధుల కింద కనీసం మరో రూ.20 కోట్లు ఇవ్వాలని కోరారు. అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల పరిస్థితి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో దారుణంగా ఉందని నివేదించారు. చావుబతుకుల్లో 20 శాతం రోగులు చావుబతుకుల మధ్య ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న సుమారు 20 శాతం మంది పేద రోగులకు తక్షణం వైద్యం చేయాలంటే ఐసీయూలు పనిచేయాల్సిన అవసరముందని వైద్యవిద్యాశాఖ లేఖలో పేర్కొంది. గుండె జబ్బులు, కిడ్నీ బాధితులు, తీవ్ర జ్వరాలు, ప్రమాద బాధితులు వీరిలో ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు, రెండు జిల్లా ఆస్పత్రులతో కలిపి 13 ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేర్‌కు సంబంధించిన వైద్య పరికరాలు అందచేయాలని కోరింది. దీనికి కనీసం రూ.20 కోట్లు పైనే అవుతుందని అంచనా వేశారు. ఒక్కో ఆస్పత్రికి మల్టీచానల్ మానిటర్లు 3, ఐసీయూ పడకలు 30, ఇన్ఫ్యూజన్ పంపులు 60, వెంటిలేటర్లు 5 చొప్పున ఏర్పాటు చేయాలని సూచించింది. ఈఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా ఇప్పటి వరకూ బోధనాసుపత్రులకు బడ్జెట్లో 45 శాతం నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.