ముంబై : భారత్‌లో కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలో ఆ సంఖ్య లక్ష దాటింది. అదే విధంగా దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో ఇప్పటి వరకు 55,000 వేల కేసులు వెలుగు చూడగా.. 2,044 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 1,366 కొత్త కేసులు నమోదవ్వగా.. 90 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వరకు 28,163 యాక్టివ్ కేసులు ఉండగా, 25,152 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ముంబైలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో వైద్య మౌలిక సదుపాయాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఎమ్మెల్యే భార్యతో పాటు మరో ముగ్గురికి కరోనా)
ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయూ) విషయానికొస్తే ముంబైలో 99 శాతం మేర నిండిపోయాయి. అంతేగాక నగరంలో 94 శాతం వెంటిలేటర్లు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శనివారం పేర్కొంది. జూన్ 11 నాటికి ముంబై నగరంలో ఐసీయూలో మొత్తం 1.181 పడకలు ఉంటే వాటిలో 1, 167 పడకలు ఇప్పటికే ఆక్రమించాయి. కేవలం 14 పడకలు మాత్రమే కొత్తగా చేరే పేషెంట్ల కోసం మిగిలి ఉన్నాయి. అలాగే 530 వెంటిలేటర్లలలో 497 ఉన్నాయి. 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 (76 శాతం) వాడుకలో ఉన్నట్లు బీఎంసీ తెలిపింది. కాగా నగరమంతా ఉన్న కోవిడ్ హాస్పిటల్స్, కోవిడ్ హెల్త్ సెంటర్లలలో 10,450 పడకలు ఉండగా, వీటిలో 9,098 పడకలు (87 శాతం) నిండిపోయాయి. అయితే కేసులు పెరుగుతన్నప్పటికీ అందుబాటులో ఉండే పడకల సంఖ్య కూడా పెంచుతున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. (కరోనా: రోగుల పేర్లు ఒకేలా ఉండటంతో...)
Comments
Please login to add a commentAdd a comment