న్యూఢిల్లీ: వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లకు ప్రాధన్యం ఇచ్చింది. పార్టీకి నమ్మకంగా ఉంటున్న సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చింది. కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, కపిల్ సిబల్, జైరాం రమేష్, అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు.
తమిళనాడుకు చెందిన పి చిదంబరం మహారాష్ట్ర నుంచి, జైరాం రమేష్ సొంతరాష్ట్రం కర్ణాటక నుంచి పోటీ చేయనున్నారు. కపిల్ సిబల్ ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగనున్నారు. అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్తో పాటు వివేక్ ఠంకా, ఛాయ వర్మలను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలైన సంగతి తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రం అధికారంలోకి రావడం కాంగ్రెస్కు కాస్త ఊరట కలిగించే విషయం. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకుగాను రాజ్యసభ ఎన్నికల్లో సీనియర్లకు సముచిత ప్రాధాన్యం కల్పించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అందలం
Published Sat, May 28 2016 2:46 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement