
హాలీవుడ్ నటి పరిస్థితి విషమం
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్, డిస్టినీ చిత్రం ద్వారా బాల నటిగా ప్రస్తానం ప్రారంభించిన లాతవియా రాబర్సన్(34) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గర్భవతి అయిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించారు. లతావియా ఓ రియాలిటీ షో ను నిర్వహిస్తున్నారు.
‘ఆర్ అండ్ ఆంప్, ఆంప్ బీ దివాస్: అట్లాంటా’ అనే టీవీ రియాలిటీ షోలో గాయనిగా కొనసాగుతున్న ఆమె మరికొద్ది రోజుల్లో మరో బిడ్డకు తల్లి కాబోతుంది. ఆమెకు ఇది వరకే మూడేళ్ల పాప కూడా ఉంది. ఇటీవల ఇన్ స్టాగ్రమ్లో తాను కొద్ది రోజుల్లో తల్లికాబోతున్నానంటూ ఓ ఫొటో కూడా పెట్టింది. అయితే, గర్భానికి సంబంధించిన సమస్య తలెత్తి తీవ్ర అనారోగ్యంపాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.