ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం.
హైదరాబాద్: ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధయ్య ఇంకా అపస్మారకస్థితిలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సిద్ధయ్య శరీరం నుంచి మూడు బుల్లెట్లు తొలగించినా, ఇంకా చిన్న మెదడులో ఉండిపోయిన బుల్లెట్ను వెలికితీయాల్సి ఉంది. అయితే ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆ బుల్లెట్ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలా? లేదా అనే విషయంపై వైద్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కాగా అదే ఆస్పత్రిలో ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష . ఓ మగబిడ్డకు జన్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఐ సిద్ధయ్యతో పాటు పుట్టిన బిడ్డను కూడా చూసేందుకు అనేకమంది తరలి రావటంతో ఆ బాబుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు సమాచారం.