బాల్యమంతా అక్కడే..
మాజీ సీఎస్ మోహన్ కందా సీతారాం ఏచూరికి స్వయానా మేనమామ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన వామç³క్ష దిగ్గజం సీతారాం ఏచూరి తెలుగు బిడ్డే. సుదీర్ఘకాలం సీపీఎం అగ్రనేతగా కొనసాగిన ఆయన స్వస్థలం కాకినాడ. బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తాతల కాలం నాటి ఇంటి స్థానంలో అపార్టుమెంట్ నిరి్మంచారు. అక్కడ కనిపించే రెండు ఏనుగు బొమ్మల గురించి స్థానికులు గొప్పగా చెప్పుకునే వారు. తాత సీతారామారావు పేరునే ఏచూరికి పెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా సీతారాంకు స్వయానా మేనమామ. చెన్నైలో మేనమామ ఇంట సీతారాం జని్మంచారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఉన్నత విద్యాభ్యాసం అనంతరం అక్కడి నుంచే వామపక్షవాదిగా రాజకీయాల్లోకి వచ్చారు. సీతారాం తండ్రి సర్వేశ్వర సోమయాజులు రవాణా శాఖలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లారు.
ప్రాచీన కళలపై ఎనలేని మక్కువ
సీతారాం తల్లి కల్పకం విద్యావంతురాలు. కాకినాడ కేంద్రంగా మూడున్నర దశాబ్దాల పాటు అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషించారు. వాతావరణ కాలుష్యం, మొక్కల పెంపకం, నీటి వనరుల పరిరక్షణ, మహిళలపై దాడుల నియంత్రణ తదితర అంశాలపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మూడేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి పేరుతో కాకినాడ గాం«దీభవన్‌లో నిరి్మంచిన కార్యాలయాన్ని చూసి సీతారాం ఎంతో సంతోíÙంచారని నాటి జ్ఞాపకాలను కాకినాడకు చెందిన వాడ్రేవు శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. మహర్షి సాంబమూర్తి ఇనిస్టిట్యూట్‌ను తాత్కాలికంగా సీతారాం ఇంట్లో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలి్పంచారని ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు తటవర్తి శ్రీనివాస్ చెప్పారు.
ప్రాచీన కళలంటే వల్లమాలిన అభిమానం కలిగిన సీతారాం తోలు బొమ్మలాట కార్మికులు నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కాకినాడ వచ్చారు. నేటి యువత గాంధీజీ ఆశయాలను ఆకళింపు చేసుకునేలాగాంధీ భవన్ చేస్తున్న కృషిని ప్రశంసించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 2008 ఆగస్టు 31న కాకినాడలో సీపీఎం కార్యాలయం సుందరయ్య భవనం ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో సీతారాం ప్రసంగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని సీపీఎం నాయకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment