సాక్షి, ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా ముప్పు బారిన పడినవాళ్లకు వైద్య చికిత్స అందిచడం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. కొంతమంది కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ తమ కర్తవ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు డాక్టర్ అంబిక. ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో పనిచేస్తున్న డాక్టర్ అంబిక కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తూ గత కొన్ని రోజులుగా ఇంటికి దూరమైయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ "ఈ కష్టకాలంలో కుటుంబసభ్యులు నాకు ఎంతో అండగా నిలుస్తున్నారు. వాళ్లను చాలా మిస్ అవుతున్నా. కానీ ఇంటికి వెళ్లలేని పరిస్థితి. రోజు ఎంతోమందికి చికిత్స అందిస్తున్నాం. నా వల్ల వాళ్లకు ఏమైనా అనారోగ్యం తలెత్తితే ఆ బాధ నాకు ఎప్పటికీ ఉండిపోతుంది". అని డాక్టర్ భావేద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment