
దుబ్బాక టౌన్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ (ఎయిమ్స్) నిర్వహించిన న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రవేశపరీక్షలో సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన డాక్టర్ బిల్ల సృజన జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2020 ప్రవేశాలకు సంబంధించి ఎయిమ్స్ మంగళవారం రాత్రి ఈ ఫలితాలను ప్రకటించింది.
డాక్టర్ సృజన దుబ్బాక పట్టణానికి చెందిన సుధాకర్, సకన్యల పెద్ద కుమార్తె. సుధాకర్ తెలంగాణ సెక్రటేరియట్ ప్లానింగ్ విభాగంలో రీసెర్చ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సృజన భర్త డాక్టర్ ప్రణీత్ ఢిల్లీ ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సృజన ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, గాంధీ ఆసుపత్రిలో ఎండీ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment