Super specialty
-
సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ ఒకే చోట..
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్ర వైద్య కళాశాలలోని కేజీహెచ్‌లో సూపర్ స్పె షాలిటీ సేవలన్నీ ఒకే చోట లభించ డం శుభ పరిణామమని కేంద్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ప్రశంసించారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కళాశాల శత దినోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్చువల్‌గా హాజరయ్యారు. ఉత్సవాల్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, కలెక్టర్ డా.మల్లికార్జున, డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జీ, మధ్యప్రదేశ్ ఆయుష్మాన్ భారత్ ముఖ్య కార్యదర్శి రమేశ్‌కుమార్, సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్యులకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. పీజీ, డిగ్రీలో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు మంత్రి రజిని మెడల్స్, అవార్డులు అందజేశారు. ఎమ్మెల్సీ డా.రవీంద్రబాబు, ఏఎంసీ ప్రిన్సిపల్ డా.బుచ్చిరాజు, ఎంపీ డా.సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్ పరీక్షలో దుబ్బాక డాక్టర్‌కు ఫస్ట్ ర్యాంక్
దుబ్బాక టౌన్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ (ఎయిమ్స్) నిర్వహించిన న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రవేశపరీక్షలో సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన డాక్టర్ బిల్ల సృజన జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2020 ప్రవేశాలకు సంబంధించి ఎయిమ్స్ మంగళవారం రాత్రి ఈ ఫలితాలను ప్రకటించింది. డాక్టర్ సృజన దుబ్బాక పట్టణానికి చెందిన సుధాకర్, సకన్యల పెద్ద కుమార్తె. సుధాకర్ తెలంగాణ సెక్రటేరియట్ ప్లానింగ్ విభాగంలో రీసెర్చ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సృజన భర్త డాక్టర్ ప్రణీత్ ఢిల్లీ ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సృజన ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, గాంధీ ఆసుపత్రిలో ఎండీ పూర్తి చేశారు. -
వైద్య సేవలు, ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ వైపు అడుగులు
- రాష్ట్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఏర్పాట్లు - హైదరాబాద్‌లో నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీలు - కరీంనగర్, ఖమ్మంలలో కూడా ఏర్పాటు - నల్లగొండకు బీబీనగర్ సేవలు ప్రారంభం... 2017లో పీజీ వైద్య కాలేజీ - మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీ... అనుబంధంగా అధునాతన వైద్యం - ప్రభుత్వాస్పత్రుల్లో 10% పెరిగిన ఆరోగ్యశ్రీ రోగులు - రెండేళ్లలో వైద్య ఆరోగ్యశాఖ సాధించిన విజయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రారంభించింది. రెండేళ్లలో అనేక విజయాలు సాధించిన వైద్య ఆరోగ్యశాఖ భారీగా భవిష్యత్తు ప్రణాళికలు రచించింది. హైదరాబాద్‌కు నలువైపులా నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటికి రూపకల్పన చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఉప్పల్-ఎల్బీ నగర్, మల్కాజ్గిరి-కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్-కూకట్పల్లి, శేరిలింగంపల్లి-రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పెద్దాస్పత్రులు నిర్మించాలనేది సర్కారు ఆలోచన. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రిని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించింది. రాజధానిలో నిర్మించనున్న ఈ ఆసుపత్రుల్లో మహిళలు, పిల్లల సంరక్షణతోపాటు ఇతర అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందించనుంది. అలాగే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి ప్రస్తుత భవనంలో మహిళ, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేకంగా టవర్లు నిర్మించనుంది. వరంగల్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని సర్కారు చేపట్టనుంది. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనుంది. కరీంనగర్, ఖమ్మంలలోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలను చేపట్టనుంది. వీటన్నింటికీ సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చుకానుంది. అలాగే నిమ్స్‌లో కిడ్నీ టవర్, ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో 24 అంతస్తులుగల రెండు టవర్లతో భారీ భవనాలు నిర్మించనుంది. అందులో అత్యాధునిక సదుపాయాలతో 2,500 పడకలతో రోగులకు సేవలు అందించనుంది. ప్రతి జిల్లాలోనూ వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలనేది సర్కారు ఉద్దేశం. 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో 100 గ్రామాలకు ఉపయోగపడేలా ఏరియా ఆస్పత్రి నెలకొల్పనుంది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆరోగ్య జిల్లాలను ఏర్పాటు చేయనుంది. పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆస్పత్రులను 100 పడకలుగా, జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా ఆధునీకరించనుంది. ప్రతి జిల్లాలో కనీసం నాలుగు చోట్ల... రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల ఎంఆర్ఐ, సీటీస్కాన్, అల్ట్రా సౌండ్, మామోగ్రఫీ ఏర్పాటు చేయాలనేది సీఎం ఆకాంక్షగా ఉంది. మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ... బీబీనగర్‌లో పీజీ వైద్య కాలేజీ మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ మంజూరైంది. 150 ఎంబీబీఎస్ సీట్లతో ఈ ఏడాది నుంచే కాలేజీ ప్రారంభం కానుంది. మరోవైపు రాష్ట్రంలో వివిధచోట్ల 200 వరకు ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. 20 నుంచి 30 వరకు పీజీ వైద్య సీట్లూ పెరిగాయి. బీబీనగర్ నిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ ప్రస్తుతం ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో ఐపీ సేవలనూ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి బీబీనగర్‌లో పీజీ వైద్య కళాశాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో అక్కడ 20 నుంచి 30 వరకు సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో అదనంగా 500 పడకలు వినియోగంలోకి వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వరంగల్, ఆదిలాబాద్‌లలో రూ. 150 కోట్ల చొప్పున సూపర్ స్పెషాలిటీ టవర్స్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. స్థల సేకరణ కూడా పూర్తయింది. టెండర్లు కూడా ఖరారయ్యాయి. కేంద్రం హెచ్ఎల్ఎల్ కంపెనీకి నిర్మాణ బాధ్యత అప్పగించింది. ఇవి పూర్తయితే 200 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 40 డయాలసిస్... 40 డయాగ్నొస్టిక్ సెంటర్లు జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన ఏరియా ఆస్పత్రుల్లో 40 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 40 డయాగ్నొస్టిక్ కేంద్రాలూ అందుబాటులోకి రానున్నాయి. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, సిద్దిపేట్, కరీంనగర్‌లలో ఐసీయూలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో ఐసీయూ సహా ట్రామాకేర్ యూనిట్‌ను నెలకొల్పారు. త్వరలో ఆదిలాబాద్‌లో ఐసీయూ, ట్రామాకేర్ యూనిట్లను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిని రూ. 120 కోట్లతో ఆధునీకరించనున్నారు. బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు అదనం వైద్య ఆరోగ్యశాఖకు 2016-17 బడ్జెట్లో రూ. 5,966.89 కోట్లు కేటాయించారు. గతేడాదికన్నా ఇది రూ. 1,036 కోట్లు అదనం. హైదరాబాద్‌లో నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఇందులో కీలక అంశం. వైద్య పరికరాల కొనుగోలు, ఉన్నవాటిని మార్చడానికి రూ. 600 కోట్లు కేటాయించారు. డయాగ్నొస్టిక్ పరికరాలు, పాత పడకల మార్పు, సివిల్ పనుల మరమ్మతులకు రూ. 316 కోట్లు కేటాయించారు. ఔషధాలు తదితరాల కోసం రూ. 225 కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం, భద్రత సేవల కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగానికి రూ. 784.87 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి రూ. 344 కోట్లు కేటాయించారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధుల నుంచి రూ. 120 కోట్లు ఆరోగ్యశ్రీకి కేటాయించారు. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి రూ. 189 కోట్లు కేటాయించారు. తగ్గిన శిశు మరణాలు...పెరిగిన ఆరోగ్యశ్రీ రోగులు తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గింది. గతంలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 38 మరణాలుగా ఉండగా ఇప్పుడది 28కి తగ్గింది. వైద్యపరంగా ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో తీసుకున్న చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. అలాగే చిన్నారులకు వ్యాక్సిన్ల కోసం కేంద్రం చేపట్టిన ఇంద్రధనస్సు కార్యక్రమం రాష్ర్టంలో విజయవంతమైంది. ఇందుకు ప్రధానమంత్రి ప్రశంసలు కూడా లభించాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలూ పెరిగాయి. గతంలో ‘ఆరోగ్యశ్రీ’ రోగుల సంఖ్య ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతం, ప్రైవేటు ఆస్పత్రుల్లో 70 శాతంగా ఉండగా ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగుల సంఖ్య 40 శాతానికి చేరుకుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు మెరుగుపడటం వల్లే ఇది సాధ్యమైంది. 2,118 వైద్య పోస్టుల భర్తీకి ఏర్పాట్లు... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు రూపొందించిన మొబైల్ యాప్‌ను ఇటీవలే రూపొందించారు. ఈ యాప్ ద్వారా 77.19 లక్షల మంది పేద కుటుంబాలు, 11.45 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛన్‌దారులు, 23 వేల మంది వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులు ప్రయోజనం పొందనున్నారు. యాప్ వాడకందారులకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు జీపీఎస్ ద్వారా ప్రత్యక్షమవుతాయని అధికారులు తెలిపారు. -
పెద్దాసుపత్రికి సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలి
► ఆసుపత్రి అభివృద్ధికి రూ.117 కోట్ల నిధులు విడుదల చేయాలి ► రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు(అగ్రికల్చర్) : జిల్లా కేంద్రంలోని డీఎస్సార్ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, జిల్లా మంత్రి నారాయణ కూ డా పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారని, అయితే ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం డీఎస్సార్ వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. ఆదిశగా చర్యలు తీసుకోవాలని, సూపర్ స్పెషాలిటీ వసతులు,మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.117 కోట్ల నిధులు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 141 మంది నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులను భర్తీ చే యాలి డిమాండ్ చేశా రు. ప్రతిరోజూ వందలాది మంది రోగుల కు,రోగ నిర్ధారణ పరీక్ష లు చేయాల్సి ఉండా కేవలం 10 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, అదేమని అడిగితే అవసరమైన కెమికల్స్ లేవని సిబ్బంది చెబుతున్నారన్నారు. విధులకు సక్రమంగా హాజరు కాని డాక్టర్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మెకనైజుడు ల్యాండ్రీ నిర్మాణం పురోగతిలో ఉన్నాయని ఎమ్మెల్యేకి వివరించారు. -
‘ఆరోగ్య వరం’గల్
మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలుగా నిర్మాణం ఎంజీఎం స్థానంలో నీలోఫర్ మాదిరిగా మాతాశిశు ఆస్పత్రి ఏరియా ఆస్పత్రులుగా హన్మకొండ ప్రసూతి, సీకేఎంలు హన్మకొండ : వైద్య సేవలకు హైదరాబాద్‌పై ఆధారపడకుండా వరంగల్ నగరాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉత్తర తెలంగాణకు ప్రభుత్వ వైద్య సేవలపరంగా పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని తాజాగా బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఎంజీఎం ఆస్పత్రి సూపర్‌గా మారుతుండగా హన్మకొండ ప్రసూతి , వరంగల్ సీకేఎం ఆస్పత్రులు ఏరియా ఆస్పత్రులుగా మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సెంట్రల్ జైలు స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీగా మారడంతో పాటు ప్రభుత్వ వైద్యపరంగా నగరంలో పలు మార్పులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. జనవరిలో హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. ఈ మేర కు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి ప్రకారం ఎంజీఎం ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి పూర్తిగా తరలించాలని నిర్ణయిం చారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని వేరేచోటుకు తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఎంజీఎంను అప్‌గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర కారాగారాన్ని తరలించిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ ప్రాంగణం విస్తీర్ణం పెరగనుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా నిబంధనల కాలేజీ క్యాంపస్‌లోనే 1200 పడకల సామర్థ్యంతో భవనాలు నిర్మిస్తారు. ఇందులో ప్రధానమంత్రి స్వస్థా సురక్షా యోజనా పథకం ఫేజ్-3 కింద 300 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారు. దీంతో ఎంజీ ఎం పడకల సామర్థ్యం 1500కు చేరుకుంటుంది. మల్టీ, సూపర్ విభాగాలు 1500 పడకలు కలిగిన ఎంజీఎంలో మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కొనసాగుతాయి. మల్టీ స్పెషాలిటీ విభాగంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పాథాలజీ, ఈఎన్టీ, మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోమెడికల్, శస్త్ర చికిత్స విభాగాలు కొనసాగుతా యి. సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, అంకాలజీ(క్యాన్సర్), గ్యాస్ట్రో, ఎండ్రోకైనాలజీ, న్యూ రో, ప్లాస్టిక్ సర్జన్లతో పాటు ఇంటెన్సివ్ కార్డియోథోరియాసిక్, కార్డియో థోరియాసిక్ సర్జన్ విభాగాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఎంజీఎంలో కొన్ని సూప ర్ స్పెషాలిటీ విభాగాలే కొనసాగుతున్నారుు. మాతా శిశు ఆస్పత్రి ఎంజీఎం ఆస్పత్రిని కాకతీయ మెడికల్ కాలేజీలో నిర్మించబోయే నూతన భవనంలోకి తరలించిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో మాతా శిశు ఆస్పత్రి(ఎంసీహెచ్ , మెటర్నల్ చైల్డ్ హెల్త్)గా మారుస్తారు. ఇందులో గైనకాలజీ (స్త్రీల సంబంధిత ఆరోగ్య సమస్యల విభాగం) పీడియాట్రిక్ (పిల్లలు) విభాగాలు కొనసాగుతాయి. పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్(నవజాత శిశువు) యూనిట్లు ఉంటాయి. అంతేకాకుండా వేర్వేరుగా వంద పడకల సామర్థ్యం కలిగిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం(చందా కాంతాయ్య మెమోరియల్) ఆస్పత్రులను ఎంజీఎం భవనాల్లోకి మారుస్తారు. 500కు పైచిలుకు పడకల సామర్థ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాంతీయ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిగా పని చేస్తుంది. దాదాపుగా హైదరాబాద్‌లో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి స్థాయిలో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జనరల్ ఆస్పత్రులు హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రులను ఎంజీఎంలోకి మార్చిన తర్వాత ఈ భవనాల్లో సాధారణ ఆస్పత్రులను కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇక్కడున్న వంద పడకల సామర్థ్యాన్ని రెండు వందల పడకలకు పెంచుతారు. ఇవి వరంగల్ తూర్పు, పశ్చిమ ఏరియా ఆస్పత్రులుగా సేవలు అందిస్తాయి. ఇక్కడ సాధారణ వైద్యసేవల ద్వారా సానుకూల ఫలితం కనిపించని రోగులను ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. హన్మకొండ, సీకేఎం ఆస్పత్రులు జనరల్ ఆస్పత్రులుగా మారడం వల్ల ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై పని భారం తగ్గుతుంది. -
ఇక ‘సూపర్’ సేవలు
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (రిమ్స్) ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) పథకం కింద రిమ్స్‌కు రూ.150 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇక రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గత ఫిబ్రవరి నెలలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకం కింద రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ కింద ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో 39 వైద్య కళాశాలలు ఎంపిక చేయగా, మనరాష్ట్రంలో వరంగల్ కాకతీయ వైద్య కళాశాల, రిమ్స్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు విస్తరించడం, ఆధునిక వైద్య సేవలు, నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపడంతో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎనిమిదేళ్లుగా సరైన వైద్య సేవలు లేక కొట్టుమిట్టాడుతున్న రిమ్స్‌లో ఇక మంచి వైద్య సేవలందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రూ.150 కోట్ల నిధులతో.. పీఎంఎస్ఎస్వై పథకం కింద కేటాయించిన రూ.150 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు సమకూర్చుతాయి. ఈ నిధుల్లో రూ.90 కోట్లు ఆస్పత్రి భవనాల కోసం, రూ.60 కోట్లు వైద్య పరికరాల కోసం కేటాయించనున్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం క్యాన్సర్ సహా ఎనిమిది కీలక వైద్య సేవలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తారు. క్యాన్సర్, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడీయాట్రిక్ సర్జరీ సంబంధిత వ్యాధులకు అధునాతన వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితోపాటు ఎంఆర్ఐ యూనిట్, ఆర్థోపెడిక్, అనస్తీయాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రోలజీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రిమ్స్‌ను పీఎంఎస్ఎస్వై పథకం కింద ఎంపిక చేయడంతో.. రిమ్స్ సామర్థ్యం వెయ్యి పడకలకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు అదనంగా 200 మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకమవుతారు. పీజీ తరగతులకు అవకాశం.. ప్రస్తుతం రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. గతేడాది ఓ బ్యాచ్ చదువు ముగించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. రిమ్స్‌లో పీజీ తరగతుల అనుమతి లేకపోవడంతో ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు ఇక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసి పీజీ కోసం ఇతర ప్రాంతాలకు పోతున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే పీజీ తరగతులకు కూడా అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండదు. గ్రామీణ నిరుపేదకు సైతం కార్పొరేట్ వైద్యం అందుతుంది. వైద్య సదుపాయాలు మెరుగుపడుతాయి.. - డాక్టర్ హేమంత్‌రావు, రిమ్స్ డెరైక్టర్ రిమ్స్‌కు రూ.150 కోట్లు మంజూరు కావడంతో ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపడుతాయి. ప్రస్తుతం చాలా విభాగాల్లో స్పెషాలిస్టు వైద్యులు లేరు. ఈ నిధులతో సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలతోపాటు, స్పెషలిస్టు వైద్య నిపుణులు వస్తారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు రిమ్స్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్పత్రి భవనాల కోసం కావాల్సిన స్థలం అందుబాటులో ఉంది. జిల్లా ప్రజలకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయి. -
డిప్యుటేషన్ల దందా!
రిమ్స్‌క్యాంపస్:మీరు విశాఖపట్నం నుంచి వస్తున్న స్టాఫ్ నర్సులా...డిప్యుటేషన్ వేయించుకొని అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా..అయితే కాస్త్త ఖర్చు అవుతుంది.. దీనికి మీరు సిద్ధమైతే పూర్తి వివరాలను మీ సీనియర్లను అడిగి తెలుసుకోండి..ఇదీ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో డిప్యుటేషన్ల దందా. లంచాలివ్వటంలో పోటీ పడుతూ కొంతమంది ఉద్యోగులు కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే డిప్యుటేషన్ వేస్తామని, ఇంకా ఎక్కువ ఇస్తే విశాఖపట్నంలోనే కదపకుండా ఉంచేస్తామంటూ సంబంధిత గుమస్తా ఆఫర్లమీద ఆఫర్లిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుల్లో ఎక్కువ మంది విశాఖకు చెందిన వారే. నిత్యం వీరంతా విశాఖ నుంచి శ్రీకాకుళం రాకపోకలు సాగిస్తున్నారు. కేజీహెచ్‌లోని సూపర్‌స్పెషాలిటీ విభాగానికి కొంత మంది స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్‌పై కావాలంటూ మూడేళ్ల కిందట కేజీహెచ్ వారు ప్రతిపాదనలు పంపారు. తమ వద్ద సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారని, కొత్తవారిని వేసుకునే వరకు డిప్యుటేషన్లను కొనసాగించాలని కోరారు. దీంతో అప్పటి రిమ్స్ డెరైక్టర్ రామ్మూర్తి ప్రతి మూడు నెలలకోసారి 30 మంది స్టాఫ్‌నర్సులను ఒక బ్యాచ్‌గా కేజీహెచ్‌కు డిప్యుటేషన్‌పై పంపేవారు. మూడు నెలలు పూర్తయిన తరువాత వేరొక బ్యాచ్ వెళ్తుంది. ఇక్కడే సంబంధిత గుమస్తాకు కల్పవృక్షం దొరికింది. నిత్యం విశాఖ నుంచి రాకపోకలు సాగించే స్టాఫ్‌నర్సులు విశాఖ డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఎగబడుతున్నారు. విశాఖ నుంచి రాకపోకలు సాగించకుండా అక్కడే ఉంటూ కేజీహెచ్‌లో పనిచేసుకొవచ్చునన్న ఆలోచనే దీనికి కారణం. విశాఖ నుంచి రాకపోకలు సాగించటానికి రోజుకు కనీసం రూ. 250 వరకు ఖర్చు కావడంతోపాటు సమయం కూడా చాలా వరకు వృథా అవుతోంది. దీన్ని తగ్గించుకోవడానికి చాలామంది డిప్యుటేషన్ల కోసం పోటాపోటీగా ఎగబడుతున్నారు. భారీగా వసూళ్లు డిప్యుటేషన్ చేయాలంటే ముడుపులు చెల్లించాల్సిందే. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ప్రాధాన్యం ఉంటుందని తోటి స్టాఫ్‌నర్సులే చెప్పుకుంటున్నారు. ఒకొక్కరూ రూ. ఆరు వేలు నుంచి ఆపై పోటీని బట్టి సొమ్ములు చెల్లించి విశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నారు. ఒక్కో బ్యాచ్‌ను పంపించినప్పుడు రూ. 5.40 లక్షల నుంచి సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు వసూళ్లు జరుగుతున్నట్టు తోటి స్టాఫ్‌నర్సులే చెప్పటం గమనార్హం. సంబంధిత గుమస్తా డిప్యుటేషన్ దందాను సాగిస్తున్నట్టు సిబ్బందే చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఒక స్టాఫ్‌నర్సుకు డిప్యూటేషన్ వేయాలంటే నెలకు రూ.ఆరువేలు చొప్పున మూడు నెలలకు రూ.18వేలు వసూ లు చేస్తున్నారని, పోటీ పెరిగిపో తే మరికొంత ఎక్కువ గా సమర్పించుకోవాల్సి వస్తుందని కొంతమంది స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీహెచ్‌లో పాతుకుపోయిన పది మంది స్టాఫ్‌నర్సులు రిమ్స్ నుంచి కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు జరుగుతుం డగా పది మంది మాత్రం చాలారోజులుగా కేజీహెచ్‌లోనే పాతుకుపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి బ్యాచ్‌కు 30 మంది కొత్తవారు వెళ్లాల్సి ఉండగా.. ఆ పది మంది మాత్రం రాజకీయ పలుకుబడి, భారీగా ముడుపులు చెల్లింపులతో కేజీహెచ్‌లోనే ఉండిపోతున్నారు. దీంతో 20 మంది మాత్రమే ప్రతి బ్యాచ్‌కు మారుతూ వస్తున్నారు. పది మందిని కదపకుండా అలా ఉంచటంపై తోటి స్టాఫ్‌నర్సులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని సంబంధిత గుమస్తాను నిలదీస్తే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయం టూ దాటుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. అధికారులకూ వాటా! డిప్యుటేషన్ జరిపిన ప్రతిసారి రూ.లక్షల్లో వసూలు చేస్తున్న సంబంధిత గుమస్తా కొంత మొత్తాన్ని రిమ్స్‌కు చెందిన కొంతమంది అధికారులకు కూడా అందజేస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే డిప్యుటేషన్లపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సదరు అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు రిమ్స్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు రిమ్స్ నుంచి కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపు ! రిమ్స్‌లో డిప్యుటేషన్లను తక్షణమే నిలిపివేయాలని ఇటీవల జరిగిన ఆస్పతి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఆయన ఆదేశాలను ఆస్పత్రి వర్గాలు పట్టించుకోలేదు. గురువారం కూడా ఒక బ్యాచ్‌ను విశాఖ కేజీహెచ్‌కు పంపించడం కొనమెరుపు. -
నిమ్స్‌లో అవినీతి బాగోతం!
వైద్య విద్యార్థుల నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణ సీటీ విభాగాధిపతిపై మంత్రికి ఫిర్యాదు విచారణకు ఆదేశించిన నిమ్స్ డెరైక్టర్ సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) కార్డియో థొరాసిక్(సీటీ) విభాగాధిపతి డాక్టర్ ఆర్.వి.కుమార్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అడిగినంత ఇచ్చినవారిని పరీక్షలో పాస్ చేసి, ఇవ్వని వారిని ఫెయిల్ చేశారని ఆరోపిస్తూ వైద్య విద్యార్థి జితేందర్‌సింగ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. దీంతో నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ గురువారం ప్రాధమిక విచారణకు ఆదేశించారు. రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్య తీసుకుంటామని డెరైక్టర్ స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే.. వైద్య విద్యార్థులు ఎంఎస్ తర్వాత ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ కోర్సు చదువుతారు. నిమ్స్ కార్డియో థొరాసిక్ విభాగంలో ఆరుగురు విద్యార్థులు చదువుతుండగా, వీరికి ఇటీవలే తుది పరీక్ష నిర్వహించారు. పరీక్షలో పాస్ చేయాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనని సీటీ విభాగాధిపతి చెప్పడంతో కొందరు ఆ మేరకు ముట్టజెప్పారు. వారిని పాస్ చేసి, మిగిలిన వారిని ఫెయిల్ చేయడంతో బాధితులు రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడిన అధికారులు.. విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి చేరడంతో విచారణకు ఆదేశించారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారని డాక్టర్ ఆర్.వి.కుమార్ స్పష్టం చేశారు. కాగా, పరీక్షల్లో పాస్ చేసేందుకు తమను రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని బాధితుడు జితేందర్‌సింగ్ చెబుతున్నాడు. -
ట్రామా కేర్లెస్
జీజీహెచ్ క్యాజువాలిటీలో కనీస సౌకర్యాలు కరువు అత్యవసర సేవల విభాగంలో పనిచేయని ఏసీలు వినియోగంలోకి రాని ఆపరేషన్ థియేటర్ కూర్చునేందుకు బల్లలు,తాగునీటి కొళాయిలూ లేవు వైద్యం కోసం రోగుల అవస్థలు గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో నాలుగేళ్లకు పైగా కాలయాపన చేసి సుమారు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్లో రోగులకు వైద్యం కోసం అవస్థలు తప్పడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కంటే ధీటుగా భవన నిర్మాణం చేసిన అధికారులు అందులో కనీసం సాధారణ వైద్యసేవలైనా అందేలా చూడడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రామా సెంటర్‌ను అధికారికంగా జనవరిలో ప్రారంభించినా వైద్యసేవలు మాత్రం గత నెలలోనే ప్రారంభమయ్యాయి. అత్యవసర వైద్యసేవల విభాగం(క్యాజువాలిటీ), ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ), ఎక్స్‌రే, సి.టి.స్కాన్, ఈసీజీ ,ల్యాబ్ తదితర వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో తొలుత వైద్యసేవలను అందిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయక పోవడంతో రోగుల అవస్థలు పడుతున్నారు. కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేదా బల్లలు కూడా అధికారులు ఏర్పాటుచేయలేదు. కొత్త భవనంలో ఎక్కడా కూడా రోగులకు తాగేందుకు మంచినీటి కుళాయి ఏర్పాటు చేయలేదు. కొన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తప్పనిసరిగా రోగులు మంచినీరు తాగి వెళ్లాలి. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం కుర్చునేందుకు బల్లలు, తాగేందుకు మంచినీటి వసతి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్లలో ఉన్న కుళాయిల్లో నీటి సరఫరా సక్రమంగా రావటం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా నిర్మించినప్పటికి నీటి సరఫరా లేకపోవటంతో టాయ్స్‌లెట్స్‌కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్స్ కోసం ఏర్పాటు చేసిన గదులు అలంకార ప్రాయంగానే ఉంటున్నాయే తప్పా సకాలంలో విధులకు హాజరుకావటం లేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో ఎక్కువగా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. పనిచేయని ఏసీలు... నాలుగు రోజులుగా క్యాజువాలిటీలో ఏసీలు పనిచేయటం లేదు. ఏసీల చల్లదనం బయటకు పోకుండా గదులను పూర్తిగా మూసివేసి నిర్మాణాలు చేయటంతో నేడు అవి పనిచేయక గదుల్లో ఉంటున్న రోగులు అల్లాడిపోతున్నారు. ప్రారంభమైన రెండునెలలకే సెంట్రల్ ఏసీలు పనిచేయకపోవటం ఇంజనీరింగ్ అధికారుల పనితీరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ప్రాణాపాయ స్థితిలోఉండే రోడ్డు ప్రమాద బాధితులు, వ్యాధి బాధితులు అత్యవసర విభాగంలో ఏసీలు పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ థియేటర్ ఊసేది... భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం ట్రామాకేర్ సెంటర్లో ఆపరేషన్ థియేటర్ తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. జీజీహెచ్ అధికారులు చిన్న ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటుచేశారు. అది ఆపరేషన్లు చేసేందుకు ఏమాత్రం సరిపోకపోవటంతో రెండునెలలుగా వినియోగంలోకి రాకుండా అలంకార ప్రాయంగానే ఉంది. నిబంధనల ప్రకారం ట్రామాకేర్ సెంటర్లో మేజర్ ఆపరేషన్ థియేటర్‌ను నిర్మిస్తేనే ఆపరేషన్లు చేసే వీలుంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ క్యాజువాలిటిలో లేక పోవటంతో బాధితులను, రోగులను పాతబిల్డింగ్(ఇన్ పేషేంట్ విభాగం) లోకి తరలించేందుకు అధిక సమయం పడుతుందని, ఈ లోగా ప్రమాధ బాధితులకు గోల్డెన్ అవర్‌లో అందాల్సిన వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని పలువురు రోగులు కోరుతున్నారు. క్యాజువాలిటీలో రోగులు అవస్థలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావును వివరణ కోరగా రోగులకు వైద్య పరీక్షల గది వద్ద నిలబడి ఉండకుండా కుర్చీలు, బల్లలు త్వరలోనే కొనుగోలు చేయిస్తామన్నారు. ఆపరేషన్ థియేటర్స్ నిర్మాణం పై విభాగంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. -
అక్రమాలకు నిలయమైన నిమ్స్
ఆస్పత్రి అకౌంట్స్ నిర్వహణపై ఆడిట్ విభాగం అభ్యంతరం వైద్య పరికరాల కొనుగోళ్లు, నిర్మాణపు పనుల్లో అవినీతే కారణం సాక్షి, సిటీబ్యూరో : గత కొంతకాలంగా ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) అవినీతికి నిలయంగా మారింది. కొంతమంది అధికారులు రోగుల సొమ్మును పందికొక్కుల్లా మింగేస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోళ్లు, అకౌంట్స్ నిర్వహణ, బకాయిల వ సూళ్లు, చెల్లింపుల్లో భారీఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం టెండర్ కూడా పిలవకుండానే ఇష్టం వచ్చినట్లు నిర్మాణపు పనులు కేటాయించడం, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ఆస్పత్రికోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. గత 13 నెలల నుంచి ఆస్పత్రి ఆదాయ, వ్యయాలపై ఆడిట్స్ నిర్వహించకపోగా, ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్ ప్రభుత్వానికి సమర్పించిన బిల్లుల్లో అన్ని లోపాలే ఉన్నట్లు విజిలెన్స్ విభాగం స్పష్టం చేసింది. అన్ని అవకతవకలే... బీబీనగర్‌లో రూ.93 కోట్లతో, నిమ్స్‌లో రూ.100 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ, ట్రామాకేర్ బ్లాక్‌లను నిర్మించారు. రూ.3 కోట్లతో మిలీ నియం బ్లాక్ నిర్మించారు. మిలీనియం బ్లాక్‌తో పాటు బీబీనగర్ నిమ్స్ నిర్మాణపు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. సూపర్ స్పెషాలిటీ, ట్రామా బ్లాక్ నిర్మాణ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా టెండర్లో ఐదు శాతం ఎక్కువ కోడ్ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. అప్పటి డెరైక్టర్ ప్రసాదరావు, డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, ఫైనాన్సియల్ కంట్రోలర్ శ్రీధర్, టెక్నికల్ అడ్వైజర్ మజారుద్దీన్, ఇంజనీర్ సమ్‌దానీలపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని ఇటీవల ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నిమ్స్ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించడం విశేషం. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై వేటు నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై ఆస్పత్రి యాజమాన్యం శనివారం వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వ హణ, అకౌంట్స్, ఆడిటింగ్‌లో లోపాలకు ఆయన్ను బాధ్యుడిని చేస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వానికి ఆయన పంపిన ఆడిట్స్‌పై విజిలెన్స్ విభాగం అనేక అభ్యంతరాలు చెప్పడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వల్లే ఈ పని చేయాల్సి వచ్చిందని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాధ్ స్పష్టం చేశారు. -
పాపం.. విమ్స్
=నిధుల కోతకు చర్యలు =సూపర్ స్పెషాలిటీలు, పడకల కుదింపు =అధికారులను నివేదిక కోరిన ప్రభుత్వం సాగర్‌నగర్, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్ర వాసులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు...అన్ని రకాల సేవలు అందేలా 21 సూపర్ స్పెషాలిటీలు.. రూ.250 కోట్లు అంచనా వ్యయంతో నిర్మాణం..ఇదీ మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి లక్ష్యం. అందుకే ఆయన హయాంలో విమ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి విడత రూ.35 కోట్లు కేటాయించారు. ఆయన లేకపోవడంతో పనులు పడకేశాయి. నిధులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రెండు విడతల్లో రూ.25 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పుడు నిధులు, సౌకర్యాలు, సదుపాయాలు కుదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మహానేత ఆశయానికి తూట్లు పొడుస్తోంది. హైదరాబాద్‌లోని నిమ్స్ తరహాలో విశాఖలో విమ్స్ నిర్మించాలని 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. దీని కోసం జాతీయరహదారిని ఆనుకొని హనుమంతవాక దరి పశుసంవర్థక శాఖకు చెందిన 110.24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీని నిర్మాణానికి రూ.250 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. 2007 అక్టోబర్‌లో భూమి పూజ చేశారు. 2009 డిసెంబర్ లేదా 2010 జనవరి నాటికి దీన్ని ప్రారంభించాలని, రెండు విడతల్లో నిర్మాణం జరపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి విడతగా 2008లో వైఎస్సార్ హయాంలో రూ.35 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఆ తర్వాత రోశయ్య ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.5 కోట్లు ఇచ్చారు. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.190 కోట్లు అవసరం. కానీ ఆ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. సూపర్ స్పెషాలిటీలను, పడకలను కుదించి నిధులకు కోత పెట్టాలన్న ఆలోచనలో ఉంది. వాస్తవానికి 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు, ఆరు బ్లాకులు నిర్మించాలి. దీన్ని రెండు విడతల్లో అందుబాటులోకి తీసుకురావాలి. మొదట విడతలో ఆరు సూపర్ స్పెషాలిటీలు, 450 పడకలు నిర్మించాలి. రెండో విడతలో 15 సూపర్ స్పెషాలిటీలు, 680 పడకలు నిర్మించాల్సి ఉంది. వీటి ప్రకారం వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలి. కానీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా సౌకర్యాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. మొదటి విడతలో ఆరు సూపర్ స్పెషాలిటీలు, 200 పడకలు, రెండో విడతలో 11 సూపర్ స్పెషాలిటీలు, 300 పడకలకు కుదించాలని ఇక్కడి అధికారులకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీనిలో భాగంగా అధికారులు ఇప్పటికే దీని ప్రకారం నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధమవుతున్నారు. నాలుగు సూపర్ స్పెషాలిటీలతో పాటు ఏకంగా 630 పడకలను తగ్గించేశారు. దీని ప్రకారం మొదటి విడతలో 200 పడకలు, ఆరు సూపర్ స్పెషాలిటీలకు రూ.44,10,34,000లు ఖర్చవుతుందని, రెండో విడతలో 11 సూపర్ స్పెషాలిటీలు, 300 పడకలకు రూ.91,60,32,000లు ఖర్చవుతుందని నివేదిక తయారు చేశారు. ఈ రెండు విడతల్లో కలిపి రూ.135 కోట్ల 70 లక్షల 65 వేలు ఖర్చవుతుందని నివేదికలో పొందుపరిచారు. వెల్లువెత్తుతున్న విమర్శలు విమ్స్‌పై ప్రభుత్వం చూపుతున్న వివక్షతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు కేటాయించాల్సి వస్తుందనే సౌకర్యాల్లో కోత విధిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తే ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నా విమ్స్‌పై నిర్లక్ష్యం చూపిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.