పెద్దాసుపత్రికి సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలి
► ఆసుపత్రి అభివృద్ధికి రూ.117 కోట్ల నిధులు విడుదల చేయాలి
► రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(అగ్రికల్చర్) : జిల్లా కేంద్రంలోని డీఎస్సార్ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, జిల్లా మంత్రి నారాయణ కూ డా పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారని, అయితే ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం డీఎస్సార్ వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.
ఆదిశగా చర్యలు తీసుకోవాలని, సూపర్ స్పెషాలిటీ వసతులు,మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.117 కోట్ల నిధులు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 141 మంది నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులను భర్తీ చే యాలి డిమాండ్ చేశా రు. ప్రతిరోజూ వందలాది మంది రోగుల కు,రోగ నిర్ధారణ పరీక్ష లు చేయాల్సి ఉండా కేవలం 10 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, అదేమని అడిగితే అవసరమైన కెమికల్స్ లేవని సిబ్బంది చెబుతున్నారన్నారు.
విధులకు సక్రమంగా హాజరు కాని డాక్టర్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మెకనైజుడు ల్యాండ్రీ నిర్మాణం పురోగతిలో ఉన్నాయని ఎమ్మెల్యేకి వివరించారు.