ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు.ఢిల్లీలోని తన నివాసంలో ఉండగా, ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. వెంటనే వైద్యులు, హృద్రోగ విభాగంలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ కార్డియో థొరాసిక్ విభాగం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆర్థికవేత్తగా ప్రఖ్యాతిగాంచిన మన్మోహన్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా దేశానికి సేవలందించారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
(చదవండి: రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్)
Delhi: Former Prime Minister Dr Manmohan Singh has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) after complaining about chest pain (File pic) pic.twitter.com/a38ajJDNQP
— ANI (@ANI) May 10, 2020
Comments
Please login to add a commentAdd a comment