న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని కన్వర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 22 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment