
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్‌తో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment