సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. ఒక్కరోజులోనే 62 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది చరిత్ర సృష్టించింది. రాష్ట్రవ్యాప్త పరిస్థితిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలని చీఫ్ సెక్రెటరీ శాంతికుమారిని ఆదేశించారు. లోతట్టు.. వరద ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన.
అలాగే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మోరంచపల్లి గ్రామం మోరంచవాగు ఉధృతికి నీట మునిగిన సంగతి తెలిసిందే. దాదాపు వందేళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో సహాయక చర్యలకు హెలికాఫ్టర్‌లను సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అయితే.. వర్షాలతో సాధారణ హెలికాఫ్టర్‌లు అక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో.. సికింద్రాబాద్ ఆర్మీ అధికారులతో సీఎస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ అక్కడ మొదలైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment