సాక్షి, అనంతపురం: ఏపీ సర్కార్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సకాలంలో స్పందించటంతో అనంతపురం జిల్లాలో చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈరోజు ఉదయం చిత్రావతి నదిలో రాప్తాడు నియోజకవర్గంలో ని చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది వద్ద కారు గల్లంతైంది. వారిని రక్షించేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది వెళ్లారు. అంతా కలిసి 10 మంది చిత్రావతి నదిలోని జేసీబీ పై ఉండిపోయారు. అనంతపురం జిల్లా యంత్రాంగం వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
(చదవండి: వైఎస్సార్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు)
విషయాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చొరవతో ఇండియన్ నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆగమేఘాలపై ప్రత్యేక హెలికాప్టర్ అనంతపురం వచ్చింది. సహాయక బృందాలు చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా కాపాడాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. సీఎం సత్వర స్పందనపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మాకిది పునర్జన్మ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సకాలంలో స్పందించి ప్రత్యేక హెలికాప్టర్ పంపటం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని చిత్రావతి నదిలో చిక్కుకుని సురక్షితంగా బయపడిన బాధితులు చెప్పారు. సీఎం జగన్ చొరవ వల్ల తమకు పునర్జన్మ లభించిందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం.. ప్రత్యేక హెలికాప్టర్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం చకచకా జరిగిపోయాయని అన్నారు.
(చదవండి: నా తల్లి, కుమార్తెపై దాడి చేసి కొట్టారు.. గత్యంతరం లేకే ఇలా..)
Comments
Please login to add a commentAdd a comment