సాక్షి, తూర్పుగోదావరి : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మంటూరు సమీపంలో ఉన్న వాడపల్లి గొంది వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని దేవిపట్నంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయల్ వశిష్ట లాంచీ మునిగి మంగళవారానికి పదిరోజులు అవుతోంది. అయినప్పటికీ ఇంకా 14 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది. ప్రమాదం సంభవించి పదిరోజులు కావడం వల్ల నీటిలో ఉన్న మృతుల శరీరంలో అవయవాలన్ని మెత్తగా మారిపోయి ఉంటాయని వైద్యులు తెలిపారు.
వాడపల్లి గొందె వద్ద లభించిన మహిళ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ దేవిపట్నంకు తరలించారు. జుట్టు లేకుండా ఉన్న మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు రాయల్ వశిష్ట లాంచీ ప్రమాదంలో 38 మృతదేహలు గోదావరిలో లభ్యం కాగా ఇంకా 13 మంది పర్యాటకుల ఆచూకీ కోసం రక్షణ సిబ్బంది గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment