సాక్షి, సికింద్రాబాద్: నగరంలోని దక్కన్ స్టోర్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంటల కారణంగా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగి కింద వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కాసేపటి క్రితమే గ్రౌండ్ ఫ్లోర్‌లో కూడా మంటలు చేలరేగాయి.. మంటలు కాస్తా పక్కనే ఉన్న మరో భవనానికి వ్యాపించాయి. ఘటనా స్థలంలో మూడు గంటలుగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మరోవైపు.. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఫైర్ సిబ్బంది నలుగురు వ్యక్తులను కాపాడారు. మరో ఇద్దరు లోపల ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment