క్లబ్బులో గొడవ: హీరోయిన్‌ అరెస్టు | British actress is arrested after drunken rampage in Bangkok nightclub, two years after she killed a Thai policeman by crashing into his car | Sakshi
Sakshi News home page

క్లబ్బులో గొడవ: హీరోయిన్‌ అరెస్టు

Published Mon, May 22 2017 5:52 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

క్లబ్బులో గొడవ: హీరోయిన్‌ అరెస్టు - Sakshi

క్లబ్బులో గొడవ: హీరోయిన్‌ అరెస్టు

బ్యాంకాక్‌: పీకలదాకా తాగి క్లబ్‌లో రచ్చ రచ్చ చేసిన బ్రిటీష్‌ నటి అన్నారీస్‌ను బ్యాంకాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. థాయ్‌ నైట్‌ క్లబ్‌కు వెళ్లిన అన్నారీస్‌ బిల్లు చెల్లించకుండా క్లబ్‌లో పనిచేసే వారితో వాగ్వాదం పెట్టుకుంది. బిల్లు కట్టాలని వారు కోరడంతో కోపం పట్టలేని రీస్‌ క్లబ్‌లో ఉన్న వస్తువులను వారిపై విసిరేసింది.

అంతేకాకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రీస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రెండేళ్ల క్రితం కారును వేగంగా నడుపుతూ పోలీసు అధికారిని ఢీ కొట్టిన కేసులో రీస్‌ అరెస్టు అయింది. క్లబ్‌లో గొడవపై ఆమెను విచారించగా.. తన కుటుంబ సమస్యల వల్లే అలా ప్రవర్తించానని రీస్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పూచీకత్తుతో రీస్‌ను వదిలినట్లు చెప్పారు. తదుపరి విచారణను కొనసాగిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement