Thai King's Second Son Returns After Decades of Estrangement - Sakshi
Sakshi News home page

27 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన థాయ్‌లాండ్ యువరాజు.. 

Published Wed, Aug 9 2023 11:32 AM | Last Updated on Wed, Aug 9 2023 11:57 AM

Thai Kings Second Son Returns After Decades of Estrangement - Sakshi

బ్యాంకాక్: థాయ్ మహారాజు వజిరాలాంగ్కార్న్(71) రెండో కుమారుడు యువరాజు వచరేసార్న్ వైవాచారవాంగ్సే(42)  సుమారు 27 ఏళ్ల తర్వాత రాజయానికి తిరిగొచ్చారు. ఆయనకు రాకను పురస్కరించుకుని స్వాగతం పలికేందుకు బ్యాంకాక్ సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీగా శ్రేయోభిలాషులు తరలి వచ్చారు. 

న్యూయార్క్ లో ఒక న్యాయ సంస్థలో పనిచేస్తున్న వచరేసార్న్ వైవాచారవాంగ్సే చాలా కాలం తర్వాత తిరిగి రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది డిసెంబరులో థాయ్ మహారాజు పెద్ద కుమార్తె యువరాణి బజ్రకితీయాబా మహిడాల్(44)మైకో ప్లాసం ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ కోమాలో ఉన్నారు. ఆమెను పరామర్శించడానికి వచ్చారా లేక రాజా కుటుంబం వారసత్వాన్ని కొనసాగించడానికి వచ్చారా అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. 

ఇదిలా ఉండగా యువరాజు థాయ్‌లాండ్ వస్తూనే ఓ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొని నిర్భాగ్యులైన పిల్లలను, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మరుసటి రోజున ఆయన దేశం(రాజ్యం)లోని ఎమరాల్డ్ బుద్ధుడి దేవాలయం తోపాటు అనేక దేవాలయాలను సందర్శించారు. రాత్రి ఒక ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ ఫోటో తీసుకున్న ఆయన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కింద 'బ్యాంకాక్ టుక్ టుక్' అని క్యాప్షన్ కూడా రాశారు.

థాయ్‌లాండ్ మహారాజు వజిరాలాంగ్కార్న్ కు నలుగురు భార్యలు ఏడుగురు సంతానం. 2016లో పట్టాభిషక్తుడైన ఆయన రెండో భార్య సుజరిణీ వైవాచారవాంగ్సేకు కలిగిన కుమారుడే వచరేసార్న్ వైవాచారవాంగ్సే. యువరాణి చాలాకాలంగా కోమాలో ఉండటంతో దుఃఖసాగరంలో ఉన్న రాజకుటుంబంలో యువరాజు రాకతో ఒక్కసారిగా సంతోషాలు వెల్లివిరిశాయి.

ఇది కూడా చదవండి: భారత్‌లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement