థాయ్ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆకాశహార్మ్యాలతో ఆకట్టుకునే బ్యాంకాక్ మరో సరికొత్త నిర్మాణంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్కైవాక్ నిర్మించి టూరిస్టుల మనసు దోచుకుంటోంది. బ్యాంకాక్‌లో అతి ఎత్తైన బిల్డింగ్‌గా గుర్తింపు పొందిన ‘కింగ్ పవర్ మహనఖాన్’ నిర్మాణం ఇటీవలే పూర్తైన సంగతి తెలిసిందే. 78 అంతస్తులతో కూడిన ఈ బిల్డింగ్‌లో ఆఖరి అంతస్తు అంచు చివర స్కైవాక్‌ను నిర్మించారు.
ఇది భూమి నుంచి సుమారు 1030 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాజుతో నిర్మితమైన ఈ స్కైవాక్‌పై నుంచి 360 డిగ్రీల కోణంలో సిటీ అందాలన్నీ వీక్షించవచ్చు. దీంతో ధైర్యవంతులు, ఉత్సాహవంతులైన పర్యాటకులు బ్యాంకాక్‌కు చేరుకుంటున్నారు. అంతేకాదు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఇంకేం.. మీరు కూడా ధైర్యవంతులేనా..? అయితే ఈసారి బ్యాంకాక్‌కు వెళ్లినపుడు స్కైవాక్‌పై నడిచి సరదా తీర్చుకోండి. అయితే గాజు పలకపై నడిచేపుడు మాత్రం ఫ్యాబ్రిక్ షూస్ ధరించడం మాత్రం మర్చిపోకండి.
Comments
Please login to add a commentAdd a comment