ఇది భూమి నుంచి సుమారు 1030 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాజుతో నిర్మితమైన ఈ స్కైవాక్‌పై నుంచి 360 డిగ్రీల కోణంలో సిటీ అందాలన్నీ వీక్షించవచ్చు. దీంతో ధైర్యవంతులు, ఉత్సాహవంతులైన పర్యాటకులు బ్యాంకాక్‌కు చేరుకుంటున్నారు. అంతేకాదు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఇంకేం.. మీరు కూడా ధైర్యవంతులేనా..? అయితే ఈసారి బ్యాంకాక్‌కు వెళ్లినపుడు స్కైవాక్‌పై నడిచి సరదా తీర్చుకోండి.