బ్యాంకాక్‌లో ధూమ్‌ధామ్‌గా...
బాలీవుడ్‌లో వచ్చిన ‘ధూమ్’ సిరీస్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఇష్టపడని వారుండరు. సూపర్‌హీరోస్ అంటే ఎలా ఉంటారో ఆ సిరీస్‌లో చూశారు జనాలు.
బాలీవుడ్‌లో వచ్చిన ‘ధూమ్’ సిరీస్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఇష్టపడని వారుండరు. సూపర్‌హీరోస్ అంటే ఎలా ఉంటారో ఆ సిరీస్‌లో చూశారు జనాలు. జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, ఆమిర్‌ఖాన్... తమ తమ స్థాయిల్లో రెచ్చిపోయి ఆ సన్నివేశాల్లో నటించారు. త్వరలో ఆ స్థాయి యాక్షన్‌ని తెలుగు తెరపై కూడా చూడబోతున్నాం. రవితేజ ఆ తరహా సన్నివేశాల్లో నటించనున్నారు. ఇంతకీ ఏ సినిమా కోసం ఇదంతా? ప్రత్యేకంగా ‘ధూమ్’ యాక్షన్ ఎపిసోడ్స్‌నే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అనుకుంటున్నారా! విషయం ఏంటంటే... రవితేజ ‘పవర్’ సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్‌ని మే తొలివారం నుంచి పది రోజుల పాటు బ్యాంకాక్‌లో తెరకెక్కించనున్నారు.
ఇందులో భాగంగా ఓ భారీ ఛేజ్‌ని కూడా తీయనున్నారు. బాలీవుడ్ స్టంట్ మాస్టర్ అలెన్ అమీన్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు రూపొందనున్నాయి. ‘ధూమ్’ సిరీస్‌కి స్టంట్స్‌ని డిజైన్ చేసింది కూడా అలెన్ అమీనే కావడం గమనార్హం. ‘ధూమ్’ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ ఎపిసోడ్స్‌ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబి). రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, రెజీనా కథానాయికలు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, మిర్చి సంపత్ ఇతర పాత్రధారులు.