ఆ ఛేజ్ ఖర్చు రెండు కోట్లు! | two crores spend for chase scene in power movie | Sakshi
Sakshi News home page

ఆ ఛేజ్ ఖర్చు రెండు కోట్లు!

Published Wed, Aug 6 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

ఆ ఛేజ్ ఖర్చు రెండు కోట్లు!

ఆ ఛేజ్ ఖర్చు రెండు కోట్లు!

ఈమధ్య కాలంలో బ్యాంకాక్‌లో తెలుగు సినిమా షూటింగ్‌లనేవి సర్వసాధారణమైపోయాయి.

ఈమధ్య కాలంలో బ్యాంకాక్‌లో తెలుగు సినిమా షూటింగ్‌లనేవి సర్వసాధారణమైపోయాయి. పాటలు, టాకీపార్ట్, యాక్షన్ పార్ట్‌లను బ్యాంకాక్‌లో ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. కానీ లేటెస్ట్‌గా ‘పవర్’ సినిమా కోసం భారీ ఛేజ్ షూట్ చేయడం టాక్ ఆఫ్ ది బ్యాంకాక్ అయ్యింది. రెండు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో భారీ ఎత్తున ఈ ఛేజ్‌ని రవితేజ, తదితరులపై ప్రముఖ బాలీవుడ్ ఫైట్‌మాస్టర్ అలెన్ అమిన్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఈ సినిమా ద్వారా రచయిత కె.ఎస్. రవీంద్రనాథ్ (బాబి) దర్శకునిగా పరిచయమవుతున్నారు.

హన్సిక, రెజీనా ఇందులో కథానాయికలు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ వారంలో రవితేజ, హన్సికపై ఓ పాట తీస్తాం. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. రవితేజలోని మాస్ పవర్, వినోదం రెండూ కలగలిసిన సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ నెల 10న పాటలను, 29న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, మాటలు: కోన వెంకట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement