థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మరణించగా, మరో 20 మంది గాయపడినట్టు సమాచారం. మరో బాంబును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సెంట్రల్ బ్యాంకాక్లోని కమర్షియల్ హబ్లో బ్రహ్మదేవుని ఆలయానికి సమీపంలో పేలుడు సంభవించింది. బాంబు పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్టు థాయ్లాండ్ నేషనల్ పోలీస్ చీఫ్ ధ్రువీకరించారు. స్కూటర్లో దాచిన బాంబు పేలినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ వీధిలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనలో భారతీయులకు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం లేదని థాయ్లాండ్లో భారత దౌత్యాధికారి చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Published Mon, Aug 17 2015 7:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement