శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సయ్యద్ జాఫర్ అనే ప్రయాణీకుని వద్ద నుంచి కేజీ బంగారంతోపాటు విలువైన పసుపు పచ్చ రంగు రాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సయ్యద్ జాఫర్ అనే ప్రయాణీకుని వద్ద నుంచి కేజీ బంగారంతోపాటు విలువైన పసుపు పచ్చ రంగు రాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఈ రోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో సయ్యద్ జాఫర్ దిగాడు.
అనంతరం విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా కేజీ బంగారంతోపాటు విలువైన రాళ్లును సయ్యద్ జాఫర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అనంతరం అతడిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.