బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం బ్యాంకాక్‌లో విద్యార్థుల బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదలో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలు అయినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మృతదేహాలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Thailand School bus Fire Update-
Initially...there were 10 fatalities.! and many injured. #Bangkok #โหนกระแส #ไฟไหม้ #ไฟไหม้รถบัส #Thailand #Schoolbus #Fire #ประเทศไทย #รถดับเพลิง pic.twitter.com/lVgc9LZdLy— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024
ట్రల్ ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్తున్న సమయంలో బ్యాంకాక్ ఉత్తర శివారు ప్రాంతమైన పాతుమ్ థాని ప్రావిన్స్ వద్ద మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయని రవాణా మంత్రి సూర్యా జుంగ్రుంగ్రూంగ్‌కిట్ తెలిపారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించటం పూర్తి చేయనందున మరణాల సంఖ్యను ఇంకా ధృవీకరించలేకపోయారని మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ మీడియాకు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు.
School bus after fire.
#ไฟไหม้รถบัสที่วิภาวดี #ไฟไหม้รถบัส #ไฟไหม้ #รถบัสไฟไหม้ #รถบัส #โหนกระแส #Thailand #Schoolbus #ประเทศไทย https://t.co/UdnhJSiPCb— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024
ఈ ఘటనపై ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రా ఎక్స్‌లో స్పందించారు. ‘ఈ ప్రమాదంలో గాయపడినవారికి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తాం’’ అని అన్నారు. విద్యార్థుల వయస్సు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సు టైర్‌లలో ఒకటి పేలడంతో అదుపుతప్పి.. మంటలు చెలరేగాయని సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు తెలిపారు.
చదవండి: హిజ్బుల్లా నస్రల్లా హత్య ప్లాన్.. బంకర్‌లోకి విషవాయువులు!
Comments
Please login to add a commentAdd a comment