హిజ్బుల్లా నస్రల్లా హత్య ప్లాన్‌.. బంకర్‌లోకి విషవాయువులు! | Israel Media Says Nasrallah Suffocated To Death From Toxic Gas | Sakshi
Sakshi News home page

హిజ్బుల్లా నస్రల్లా హత్య ప్లాన్‌.. బంకర్‌లోకి విషవాయువులు!

Published Tue, Oct 1 2024 1:59 PM | Last Updated on Tue, Oct 1 2024 2:01 PM

Israel Media Says Nasrallah Suffocated To Death From Toxic Gas

జెరూసలేం: ఇజ్రాయెల్‌ దళాల చేతిలో హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హత్యకు గురయ్యాడు. బీరుట్‌లో సీక్రెట్‌ బంకర్‌లో దాకున్న నస్రల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. అయితే, బంకర్‌లోకి చొచ్చుకెళ్లిన విషవాయువుల కారణంగా నస్రల్లా ఊపిరి ఆడక మృతి చెందినట్టు తాజాగా ఇజ్రాయెల్‌ మీడియాలో తెలిపింది.

ఇజ్రాయెల్‌కు చెందిన మీడియా చానెల్‌-12 తెలిపిన వివరాల ప్రకారం..‘ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నస్రల్లా దాక్కున్న బంకర్‌ బద్దలైపోయింది. అనంతరం, ఐడీఎఫ్‌ దళాలు ప్రయోగించిన విష వాయువుల కారణంగా బంకర్‌లో దాగి ఉన్న హిజ్బుల్లా చీప్‌ హసన్‌ నస్రల్లా ఉక్కిరిబిక్కిరి విషవాయువుల కారణంగా నస్రల్లాకు ఊపిరి పీల్చుకోవడం నరకంగా మారింది. విషవాయువులతో ఎంతో వేదన అనుభవించి మరణించాడు. 80 టన్నుల బరువుండే బంకర్ బస్టర్ బాంబులు జారవిడవడంతో భారీ పేలుడు సంభవించిందని, ఫలితంగా బంకర్ విషవాయువులతో నిండిపోయిందని వివరించింది.

 

 

మరోవైపు.. ఇజ్రాయెల్‌ దాడులు చేసిన ప్రాంతం నుంచి నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అతడి శరీరంపై ఎలాంటి గాయాలు  లేకపోవడాన్ని లెబనాన్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ చెబుతున్న ఈ వార్తలు అతడి మృతికి గల కారణాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే, హిజ్బుల్లా మాత్రం ఇప్పటి వరకు నస్రల్లా మృతికి గల కచ్చితమైన కారణాన్ని వెల్లడించపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌తో తమ పోరాటం కొన సాగుతుందని హిజ్బుల్లా తాత్కాలిక చీఫ్‌ నయీం కస్సెమ్‌ స్పష్టం చేశారు. నస్రల్లాతో పాటు ఇతర టాప్‌ కమాండర్లను పోగొట్టుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. లెబనాన్‌లో భూతల దాడులు జరపాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించుకున్న పక్షంలో అందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోగొట్టుకున్న కమాండర్ల స్థానాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారమైంది. ఈ సందర్బంగా తమ పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయడం ఇజ్రాయెల్‌ వల్లకాదు. డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారు. కమాండర్‌ ఎవరైనా గాయపడితే వారితో భర్తీ చేస్తాం. 2006లో ఇజ్రాయెల్‌తో నెలపాటు పోరాడాం. ఈసారి అంతకంటే ఎక్కువ కాలమే పోరు సాగుతుందని అనుకుంటున్నాం అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బాగ్దాద్‌: అమెరికా మిలిటరీ బేస్‌పై రాకెట్ల దాడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement