2000, ఏప్రిల్ 20.. రాష్ట్రంలోని పలు సినిమా థియేటర్లవద్ద భారీ కోలాహలం.. పవన్ కల్యాణ్ హీరోగా కొత్త దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన 'బద్రి' విడుదలైన రోజది..
2000, ఏప్రిల్ 20.. రాష్ట్రంలోని పలు సినిమా థియేటర్లవద్ద భారీ కోలాహలం.. పవన్ కల్యాణ్ హీరోగా కొత్త దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన 'బద్రి' విడుదలైన రోజది. సినిమా హిట్. పవన్ నటనతోపాటు హీరోయిన్ల అందచందాలపైనా థియేటర్ల బైట చర్చలు. 'బద్రి' ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రేణు దేశాయ్ తర్వాతి కాలంలో పవర్ స్తార్ ను పెళ్లాడగా, మరో హీరోయిన్ అమీషా పటేల్.. మరో నాలుగైదు తెలుగు సినిమాల్లో నటించి, అంతకు ముందే తనకు అచ్చొచ్చిన బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఆ అమిషాయే గురువారం 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. విషయం తెలుసుకున్న నెటిజన్లలో కొందరు 'అప్పుడే ఆ హీరోయిన్ కు 40 ఏళ్లొచ్చాయా!' అనుకున్నారు.
బ్యాంకాక్ లోని ఓ రిసార్ట్స్ లో అమిషా తన 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంది. తన బిజినెస్ పార్ట్ నర్ పరిణీత్ కునాల్, ఆయన భార్య షామిలీతో కలిసి అమీషా బర్త్ డే కేక్ కట్ చేసింది. వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 2000 సంవత్సరంలో 'కహోనా ప్యార్ హై' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది 'బద్రి'తో తెలుగు తెరపై తళుక్కుమంది. అవకాశాలు పలుచబడటంతో ఈ మధ్య సనిమాలకు దూరమైన అమీషా.. త్వరలోనే 'దేశీ మ్యాజిక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.