
ప్రపంచంలో సురక్షితమైన సిటీ!
ప్రపంచంలో లండన్ తర్వాత రెండవ స్థానాన్ని బ్యాంకాక్ నగరం ఆక్రమించింది. కిందటేడాది ఈ నగరాన్ని 11 మిలియన్ల మంది సందర్శించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
విదేశాలలో!
ప్రపంచంలో లండన్ తర్వాత రెండవ స్థానాన్ని బ్యాంకాక్ నగరం ఆక్రమించింది. కిందటేడాది ఈ నగరాన్ని 11 మిలియన్ల మంది సందర్శించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడి అత్యాధునిక సదుపాయాలు గల హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్, ఆకర్షణీయ స్థలాల కారణంగా ఈ నగరం రెండవ స్థానాన్ని ఆక్రమించినట్టుగా టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరంగానూ బ్యాంకాక్ పేరొందింది. థాయిలాండ్‌కి రాజధాని అయిన ఈ నగరం సంప్రదాయతకు, ఆధునికతకు మారుపేరుగా నిలిచింది.
* ప్రజలలో 95 శాతం మంది బౌద్ధమతారాధకులు.
* 5.5 టన్నుల బరువుగల బంగారు బుద్ధుని ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత విలువైన, మతపరమైనదిగా పేరు పొందింది.
* పర్యాటకులు ఎక్కువగా నూతన సంవత్సర వేడుకలకు, వేసవి వేడి నుంచి చల్లదనాన్ని పొందడానికి ఈ నగరానికి చేరుకుంటారు.
* అత్యంత చల్లగా ఉండే కాలం నవంబర్ - ఫిబ్రవరి.
* వారాంతంలో జరిగే జె.జె.మార్కెట్ అతి పెద్దది. ఇది 27 ఎకరాలలో ఉంటుంది.