బ్యాంకాక్‌లో తొలి ఆడియో ఫంక్షన్!
ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల షూటింగ్స్ హైదరాబాద్‌లో కన్నా బ్యాంకాక్‌లోనే ఎక్కువ జరుగుతున్నాయి. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా దాదాపుగా అన్ని సినిమాలూ పాటల కోసమో, సన్నివేశాల చిత్రీకరణ కోసమో బ్యాంకాక్‌ని వేదికగా మలుచుకుంటున్నాయి. అయితే ఇంతవరకూ ఆడియో ఫంక్షన్ అనేది బ్యాంకాక్‌లో జరుగలేదు. ఆ లోటు కూడా తీరిపోనుంది.
బ్యాంకాక్‌లో ఆడియో ఫంక్షన్ జరుపుకోబోతున్న తొలి తెలుగు సినిమాగా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ నెల 10న బ్యాంకాక్‌లో పాటలను విడుదల చేయనున్నారు. సుమంత్, పింకీ సావిక జంటగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో చెర్రీ ఫిలిమ్స్ పతాకంపై పూదోట సుధీర్‌కుమార్ నిర్మించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రానికి కథ-మాటలు: ఎస్.ఎస్. కాంచీ, పాటలు: చైతన్యప్రసాద్, కీరవాణి.