బ్యాంకాక్ పేలుడు నిందితుడు గుర్తింపు !
బ్యాంకాక్ : థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బాంబు పేలుడు నిందితులను పట్టుకునేందుకు స్థానిక ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా నిందితుల కోసంగా గాలింపు చర్యలు చేపట్టింది. అలాగే బాంబు పేలుడు సంభవించిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలస్తున్నారు. సీసీ ఫుటేజ్ల పరిశీలనలో ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించాం...కానీ అతడు సరిగ్గా కనిపించడం లేదని సదరు అధికారి తెలిపారు. అతడే నిందితుడని భావిస్తున్నామన్నారు. అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న సంస్థకు చెందిన వాడిగా అనుమానిస్తున్నామన్నారు.
సోమవారం సాయంత్రం సెంట్రల్ బ్యాంకాక్లోని కమర్షియల్ హబ్లో బ్రహ్మదేవుని ఆలయానికి సమీపంలో అత్యంత శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డుతున్నారు.