థాయ్లాండ్లోని మధ్య ,ఈశాన్య ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 73కు చేరుకుందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ఆదివారం ఇక్కడ వెల్లడించింది.
థాయ్లాండ్లోని మధ్య ,ఈశాన్య ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 73కు చేరుకుందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ఆదివారం ఇక్కడ వెల్లడించింది. దేశంలోని దాదాపు 22 ప్రావెన్స్ల్లోని 4 వేల పట్టణాలను వరద నీరు ముంచెత్తిందని తెలిపింది. అయితే కొన్ని ప్రావెన్స్ల్లో వరద నీరు తగ్గుముఖం పట్టిందని తెలిపింది.
ఆ వరదలతో దాదాపు 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొంది. వరద ఉధృతి అధికంగా ప్రాంతాల నుంచి ఎనిమిది వేల మందిని బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పింది.వర్షాకాలం సందర్బంగా గత నెల సెప్టెంబర్ మధ్య నుంచి దేశంలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి.దాంతో దేశంలో వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.