నిఖత్, హుసాముద్దీన్
న్యూఢిల్లీ: బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, హుసాముద్దీన్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మహిళల 51 కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన జరీన్ 4–1తో జుతమస్ జిత్పోంగ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించగా... మరో తెలంగాణ బాక్సర్, కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత హుసాముద్దీన్ పురుషుల 56 కేజీల విభాగంలో 3–2తో అమ్మరిట్ యోదమ్ (థాయ్‌లాండ్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. వీరితో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత దీపక్ సింగ్ (49 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), బ్రిజేష్ యాదవ్ (81 కేజీలు)లు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్స్‌కు చేరారు. మహిళల విభాగంలో మంజు రాణి (48 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment