బ్యాంకాక్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న ఆందోళనలకు థాయ్‌లాండ్ ప్రధాని యింగ్‌లుక్ షినవత్ర ఎట్టకేలకు తలవంచారు. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 2లోపు ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించారు. అప్పటిదాకా అపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని వెల్లడించారు. సోమవారం జాతినుద్దేశించి టీవీలో చేసిన ప్రసంగంలో ఈ మేరకు ప్రకటించారు. ‘‘అన్ని వర్గాల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి’’ అని ఆమె అన్నా రు. అయితే ప్రధాని ప్రకటన ఆందోళనకారులను శాంతపర్చలేదు. ఇది తమ తొలి విజయమంటూనే ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కొనసాగిస్తామన్నారు.