Yingluck Shinawatra
-
లండన్‌కు పారిపోయిన మాజీ ప్రధాని..!!
బ్యాంకాక్ : థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను అరెస్టు చేసేందుకు క్రిమినల్ కోర్టు రెండోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇంగ్లక్ ధాన్య సబ్సిడీ పథకంలో అవినీతి పాల్పడి, దేశానికి బిలయన్ల డాలర్ల నష్టం వాటిల్లేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మాజీ ప్రధానిపై రెండో అరెస్టు వారెంట్‌ను కోర్టు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ధాన్య సబ్సిడీ పథకంలో అవినీతిపై పలుమార్లు కోర్టుకు హాజరైన ఇంగ్లక్ ఈ ఏడాది ఆగష్టులో దేశం విడిచి పారిపోయారు. విచారణ సందర్భంగా పథకంలో అవినీతి జరిగితే తన తప్పు ఎలా అవుతుందని, రాజకీయ కుట్ర వల్లే తనను బలి పశువును చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారని సమాచారం. అయితే ఆమె థాయ్‌లాండ్ నుంచి దుబాయ్‌కు ఎలా పారిపోయారన్న విషయం మాత్రం ఇప్పటివరకూ అంతు చిక్కడం లేదు. తాజా రిపోర్టుల ప్రకారం సెప్టెంబర్ 11న ఆమె దుబాయ్ నుంచి లండన్‌కు వెళ్లిపోయారని తెలిసింది. 2014లో ఇంగ్లక్ ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు కుట్ర పన్నిన ప్రస్తుత థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా దౌత్యంతో ఇంగ్లక్‌కు పట్టుకుంటామని ఇంటర్‌పోల్‌ను ఇందుకు వినియోగిస్తామని పేర్కొన్నారు. -
మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు
బ్యాంకాక్ : వరి సబ్సిడీ పథకంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందన్న ఆరోపణ లపై థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాకు ఐదేళ్ల జైలుశిక్షను విధిస్తూ బుధవారం ఓ థాయ్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఇంగ్లక్ గత నెలలో దేశం విడిచి పారిపోయారు. థాయ్‌లాండ్‌లో 2011లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరి సబ్సిడీ పథకం హామీతో ఇంగ్లక్‌కు చెందిన ఫూ థాయ్ పార్టీ అధికారం చేపట్టింది. అనంత రం రైతులకు 50శాతం అధికంగా డబ్బు చెల్లించి ఇంగ్లక్ ప్రభుత్వం వరిని కొనుగోలు చేసింది. ఈ ప్రభావం ఎగుమతులపై పడి అప్పటివరకు వరి ఎగుమతిలో ప్రపంచం లోనే అగ్రస్థానంలో ఉన్న థాయ్‌లాండ్ తన స్థానాన్ని కోల్పోయింది. ఈ పథకంలో అవినీతి జరుగుతోందని హెచ్చరించినప్ప టికీ ఇంగ్లక్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ప్రాసిక్యూ టర్లు ఆరోపించారు. -
కోర్టుకు హాజరైన మాజీ ప్రధాని
బ్యాంకాక్: అధికార దుర్వినియోగం కేసులో విచారణ కోసం థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా(46) మంగళవారం సుప్రిం కోర్టుకు హాజరయ్యారు. రైస్ సబ్సిడీ పథకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలను షినవత్రా ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు రుజువైతే పది ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే తన పై వచ్చిన ఆరోపణలు రాజకీయ కుట్రగా షినవత్రా అభివర్ణించారు. గత ఏడాది సైనిక తిరుగు బాటుతో బలవంతంగా గద్దెదిగారు. ఇప్పటికే షినవత్రా రాజకీయాల్లో 5 సంవత్సరాల వరకు నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. -
థాయ్ ప్రధాని తొలగింపు
అధికార దుర్వినియోగం కేసులో కోర్టు తీర్పు బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా(46)ను, ఆమె కేబినెట్లోని 9 మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు బుధవారం పదవుల నుంచి తొలగించింది. షినవత్రా శక్తిమంతమైన తన కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు ఓ అధికారి బదిలీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన థావిల్ ప్లీన్శ్రీని 2011లో అక్రమంగా బదిలీ చేశారని, ఇందులో షినవత్రా, 9 మంది మంత్రుల ప్రమేయముందని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే కేబినెట్.. ఉప ప్రధాని నివత్తుమ్రొంగ్ బూన్సంగ్పైసన్ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించింది. థావిల్ బదిలీని అసాధారణ రీతితో కేవలం నాలుగు రోజుల్లోనే హడావుడిగా పూర్తి చేశారని, సంబంధిత పత్రాల్లోని తేదీల్లో తేడాలున్నాయని కోర్టు ఆక్షేపించింది. కాగా, బదిలీతో తనకు సంబంధం లేదని, ఆ వ్యవహారాన్ని ఉప ప్రధానికి అప్పగించానని షినవత్రా విచారణలో చెప్పారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేయగా, అది తమను గద్దె దింపేందుకు చేసిన కుట్ర అని అధికార పార్టీ ఫ్యూ థాయ్ విమర్శించింది. కోర్టు తీర్పుతో థాయ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం మరికొంత కాలం కొనసాగనుంది. -
థాయ్‌లాండ్‌లో ఆగని హింసాకాండ... బ్యాంకాక్ వీడిన ప్రధాని
దేశం కుప్పకూలుతుందనిఆర్మీ చీఫ్ హెచ్చరిక బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, హింసాకాండ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా దేశ రాజధాని బ్యాంకాక్‌ను వీడి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌కు 150 కి.మీ దూరంలో అధికార విధులు నిర్వహిస్తున్నారని ఆమె కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇంగ్లక్ రాజధాని బయట ఎన్నాళ్లుంటారో మాత్రం వెల్లడించలేదు. మరోపక్క సోమవారం థాయ్‌లాండ్‌లోని ఓ రాష్ట్రంలో ఇంగ్లక్ ప్రసంగానికి నిరసనకారులు అడ్డుతగిలారు. ‘ఓ పక్క ప్రజలను ఊచకోత కోస్తోంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావ్?’ అంటూ లౌడ్ స్పీకర్లు, విజిళ్లతో నిరసన తెలిపారు. ఆందోళనపై ఇంగ్లక్ స్పందిస్తూ..ప్రజలు హింసను విడనాడాలని కోరారు. మాజీ ప్రధాని, తన సోదరుడు థక్సిన్‌కు ఇంగ్లక్ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, ఆమె తక్షణం గద్దె దిగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. నిరసనల నేపథ్యంలో ఆమె గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జోక్యం పరిష్కారం కాదు: ఆర్మీ ఇదిలా ఉండగా హింసాకాండ ఇలాగే కొనసాగుతూ పోతే దేశం కుప్పకూలుతుందని ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్‌ఓచా హెచ్చరించారు. అయితే ప్రస్తుత సంక్షోభానికి సైనిక జోక్యం పరిష్కారం కాదన్నారు. దేశాన్ని గడ్డున వేసేందుకు ఆర్మీ మరోసారి రంగంలోకి దిగే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. కాగా, గతవారం ఆందోళనకారుల ర్యాలీలపై ప్రభు త్వ బలగాలు జరిపిన దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు చనిపోయారు. దాడిలో మెదడుకు గాయాలైన ఆరేళ్ల బాలిక సోమవారం మృతి చెందిం ది. ఆమె సోదరుడు తల గాయాలతో శని వారం చనిపోయాడు. ట్రాట్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఐదేళ్ల బాలిక, మరో మహిళ మృతిచెందారు. -
కన్నీళ్లు పెట్టుకున్న థాయ్‌లాండ్ ప్రధాని
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్ర(46) కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆమె మంగళవారం కేబినెట్ భేటీ నిర్వహించారు. పార్లమెంటును రద్దు చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా.. ‘మనమంతా థాయ్ వాసులం. ఎందుకు ఒకరిని ఒకరు బాధపెట్టుకుంటున్నాం? ఇప్పటికే నేను చాలా రాజీ పడ్డాను. ఇంకెంత దూరం నన్ను వెనక్కు వెళ్లమంటారు? థాయ్ నేలపై నేను అడుగుకూడా పెట్టకూడదని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆందోళనకారులను ఉద్ధేశించి పేర్కొంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. -
థాయ్‌లాండ్ పార్లమెంటు రద్దు
బ్యాంకాక్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న ఆందోళనలకు థాయ్‌లాండ్ ప్రధాని యింగ్లుక్ షినవత్ర ఎట్టకేలకు తలవంచారు. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 2లోపు ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించారు. అప్పటిదాకా అపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని వెల్లడించారు. సోమవారం జాతినుద్దేశించి టీవీలో చేసిన ప్రసంగంలో ఈ మేరకు ప్రకటించారు. ‘‘అన్ని వర్గాల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి’’ అని ఆమె అన్నా రు. అయితే ప్రధాని ప్రకటన ఆందోళనకారులను శాంతపర్చలేదు. ఇది తమ తొలి విజయమంటూనే ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కొనసాగిస్తామన్నారు. -
థాయ్‌లాండ్ పార్లమెంట్ రద్దు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రధాని యింగ్లుక్ షినవత్ర దిగివచ్చారు. పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. సాధారణ ఎన్నికలు జరిపించేందుకు తేదీని త్వరలో ప్రకటిస్తామని టీవీ ద్వారా చేసిన ప్రసంగంలో తెలిపారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. పార్లమెంటును రద్దు నిర్ణయానికి రాజకుటుంబం ఆమోదం తెలపాల్సివుంది. 2011, ఆగస్టులో తాను పదవి చేపట్టిన నాటి నుంచి దేశాన్ని సామాజిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాటుపడ్డానని షినవత్ర పేర్కొన్నారు. పార్లమెంటును రద్దు చేసి 60 రోజుల్లో తిరిగి ఎన్నికలు జరిపేందుకు షినవత్ర ఆదివారం సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా పదవులకు రాజీనామా చేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించడం, తనను గద్దె దింపేందుకు ఆందోళనకారులు సోమవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సిద్ధమవడం వంటి కారణాల నేపథ్యంలో షినవత్ర ఈ నిర్ణయం తీసుకున్నారు. -
థాయ్ ‘క్షమా’ క్షోభ
అవినీతి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్య తరగతి యువత, ప్రజలు వీధులకెక్కి ఆందోళనలు చేపట్టారు. ఆ ఆందోళనలను ఆధారంగా చేసుకొని తస్కిన్ వ్యతిరేకశక్తులు, రాచరికవాదులు యింగ్లుక్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల పోరాటం ఎప్పుడో హైజాక్ అయింది. ‘నవ్వులు చిందించే దేశం’ థాయ్‌లాండ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని యింగ్లుక్ షినావత్ర ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు కోరుతున్నారు. 1947లో స్వాంతంత్య్రం సాధించుకున్న థాయ్ ప్రజాస్వామ్యం ‘పునరపి జననం పునరపి మర ణం’ అన్నట్టు పుడుతూ గిడుతూ బతుకీడుస్తోంది. పద్దెనిమిది సైనిక తిరుగుబాట్లను చూసిన ఆ దేశంలో సైనిక, పౌర ప్రభుత్వాలు రుతువుల్లా వచ్చి పోతుంటాయి. నేడు అధికారంలో ఉన్న ప్యూథాయ్ పార్టీ నేత్రి యింగ్లుక్ 2011 ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధాని. యింగ్లుక్ ప్రభుత్వం గిట్టిపోవాలని కోరుతున్న ప్రతిపక్ష నేత సుతెప్ తౌగ్సుబెన్ గత ప్రభుత్వంలో ఉప ప్రధాని. ఆయనకు అవినీతి ఆరోపణలతో పార్లమెంటు సభ్యత్వా న్ని కోల్పోయిన ఘనతే కాదు, 2006 సైనిక తిరుగుబాటుకు సూత్రధారి అన్న ఖ్యాతి కూడా ఉంది. అ తిరుగుబాటులో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని తక్సిన్ షినావత్ర నేటి ప్రధాని యింగ్‌లుక్‌కు స్వయానా తోడబుట్టినవాడు. రెండు దఫాలు అదికారంలో ఉండి ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. ఆయన పలుకుబడి నేటికీ గ్రామీణ ప్రాంతా ల్లో చెక్కుచెదర లేదు. ఆ పలుకుబడితోనే చెల్లెల్ని అధికారంలోకి తేగలిగారు. అన్నీ ఉన్నా... అన్నట్టు ఆయన మాత్రం దుబాయ్‌లో స్వచ్ఛంద ప్రవాస జీవితం గడపా ల్సివస్తోంది. అవినీతి కేసుల్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే అందుకు కారణం. తక్సిన్ కీలుబొమ్మగా అధికారాన్ని నెరపుతున్న యింగ్లుక్ ఇటీవల తన సోదరుడు స్వదేశానికి రావడానికి వీలుగా ‘క్షమాభిక్ష చట్టాన్ని’ ప్రతి పాదించారు. దీంతో తక్సిన్పట్ల, అవినీతిపట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్యతరగతి ప్రజలు యింగ్‌లుక్‌కు వ్యతి రేకంగా వీధులకెక్కి ఆందోళన చేపట్టారు. ఆ ఉద్యమంలో ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీకి, దాని నేత సుతెప్కు అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు కనిపించాయి. థాయ్ ‘ఆనవాయితీ’కి విరుద్ధంగా సైనిక కుట్ర లేకుండానే యింగ్లుక్ ప్రభుత్వా న్ని కడతేర్చే ఘట్టాన్ని ప్రారంభించారు. కారణం... 1950ల నుంచి రాచరికానికి, సైన్యానికి మధ్యన పెనవేసుకున్న బలీ యమైన బంధం సడలిపోవడమే. ‘నవ్వు ఎరుగని రాజు’గా పేరుమోసిన రాజు భూమిబల్ అదుల్యదేజ్ నామమాత్రపు దేశాధినేతే. అయినా కీలక రాజకీయ పాత్రధారి. ఆయన మంచం పట్టగా చక్రం తిప్పిన రాణి సిరికితే కూడా ఇటీవల మంచమెక్కారు. దీంతో థాయ్ రాజకీయ సమీకరణాలు మారడం మొదలైంది. సైన్యానికి కీలక నేత జనరల్ ప్రయు త్ చాన్-ఓచా సుదీర్ఘకాలంగా రాజుకు విధేయులు. ఆయ న ఇప్పుడు తస్కిన్‌తో సయోధ్య కుదుర్చుకున్నారు. బదులుగా యింగ్లుక్ భారీ ఎత్తున సైనికాధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. మేజర్ జనరల్స్ సంఖ్య హఠాత్తుగా రెట్టిం పై 464కు చేరింది. వారిలో విధుల్లో ఉన్నవారు 230 మంది కాగా మిగతావారు ‘ఉపగ్రహ జనరల్స్.’ సైన్యం ‘తటస్థత’ లోని రహస్యం ఇదే. ‘ప్రజాస్వామిక సంస్కరణల ఉద్య మ’ నేత సుతెప్... యింగ్లుక్ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించాలని కోరడంలేదు. ఎన్నికలతో సంబంధంలేని రాజ్యాంగేతర ‘ప్రజామండలి’కి అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా, నిర్ణీత వ్యవధి ప్రకా రం 2014లోనైనా ఎన్నికలు జరిగితే తస్కిన్ ఎర్ర చొక్కాల గెలుపు ఖాయం. మెజారిటీ ప్రజల మద్దతున్న తస్కిన్, మద్దతులేని సుతెప్లు ఇద్దరి చరిత్రలు నలుపే. అప్రజాస్వామిక, రాజ్యాంగేతర అధికారం కోరుతు న్న సుతెప్ వెంట పట్టణ మధ్యతరగతి, విద్యావంతులు ఎందుకు పోతున్నట్టు? నిజానికి వాళ్లు ఆయనకంటే ముం దే వీధుల్లోకి వచ్చారు. వారిని వీధుల్లోకి తెచ్చినది ప్రధాని యింగ్లుక్ క్షమాభిక్ష! తస్కిన్ చట్టానికి అందకుండా శిక్షను తప్పించుకోవడానికి యింగ్లుక్ దొడ్డి దోవను తెరవడానికి నిరసనగా అవినీతి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్య తరగతి యువత, ప్రజలు వీధులకెక్కి ఆందోళన చేపట్టా రు. ఆ ఆందోళనలను ఆధారంగా చేసుకొని తస్కిన్ వ్యతిరేకశక్తులు, రాచరికవాదులు సైన్యం అండలేకుండా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు. గురువారం రాజు పుట్టిన రోజు. ఆదివారం వరకు ఆ వేడుకలు కొనసాగుతాయి. అంతవరకు ఆట విడుపు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలైన ‘ఆట.’ ఈ ఆటలో గెలుపు ఎవరిదో నిర్ణయించేది చివరికి సైన్యమే. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల పోరాటం ఎప్పుడో హైజాక్ అయింది. పసు పు చొక్కాలు, ఎర్రచొక్కాలు ధరించి తలలు పగలగొట్టుకోడానికి సిద్ధమవుతున్న పట్టణ, గ్రామీణ ప్రజలకు మిగిలేది పగిలిన తలలే. యింగ్‌లుక్‌కు పదవీ గండం తప్పినాగానీ తక్సిన్ ఆట కట్టయినట్టే. క్షమాభిక్షకు తెరపడినట్టే. - పిళ్లా వెంకటేశ్వరరావు -
గద్దె దిగను: థాయ్ ప్రధాని
బ్యాంకాక్: రెండో రోజుల్లోగా పదవి నుంచి తప్పుకోవాలన్న విపక్ష డిమాండ్‌ను థాయ్‌లాండ్ ప్రధాని యింగ్లుక్ షినవత్రా తోసిపుచ్చారు. ఆ డిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. దేశంలో తిరిగి శాంతి నెలకొనేందుకు రాజ్యాంగానికి లోబడి తాను చేయగలింది ఏమైనా ఉంటే చేయడానికి సిద్ధమని సోమవారం విలేకర్లతో అన్నారు. ప్రజలు ఎన్నుకోని ప్రజామండలికి అధికారం కట్టబెట్టాలన్న విపక్ష నేత సుథెప్ థాగ్స్బాన్ డిమాండ్ రాజ్యాంగం ప్రకారం ఆచరణ సాధ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. మరోపక్క.. బ్యాంకాక్‌లో సోమవారం కూడా విపక్ష మద్దతుదారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు జరిగాయి. ప్రభుత్వ భవనం, మెట్రోపాలిటన్ పోలీస్ సంస్థల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వందలాది ఆందోళనకారులపై పోలీసులు రబ్బరు తూటాలు, బాష్పవాయివు ప్రయోగించారు. -
థాయ్‌లాండ్ ప్రధాని పరార్
-
థాయ్‌లాండ్ ప్రధాని పరార్
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వారం రోజులుగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. రామ్ఖామ్హేంగ్ వర్సిటీ ప్రాంగణంలో చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. ఈ ఘర్షణల్లో మరో 54 మంది గాయపడ్డారు. ప్రధాని యింగ్లుక్ షినవత్రాకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ప్రజా తిరుగుబాటు స్థాయికి చేరుకోవడంతో, ఆమె సురక్షితమైన పోలీసు ప్రాంగణంలోకి పోయి, అక్కడ తలదాచుకున్నాయి. ప్రధాని నివా సం, కార్యాలయం ఉన్న ప్రభుత్వ భవనం చుట్టూ ఉన్న ఇను ప కంచెను తెంచి లోనికి చొరబడేందుకు నిరసనకారులు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాదాపు 30వేల మం ది నిరసనకారులు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో పోలీ సులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ప్రధాని దేశాన్ని విడిచి పారిపోయినట్లు వచ్చిన వదంతులను ప్రభుత్వం ఖండించింది. కాగా, థాయ్‌లాండ్‌లో సోమవారం దేశవ్యాప్త సమ్మెకు, నిరసనోద్యమానికి నాయకత్వం వహిస్తున్న డెమోక్రాట్ పార్టీ నేత, మాజీ ఉపప్రధాని థౌగ్సుబాన్ పిలుపునిచ్చారు. పది ప్రభుత్వ కార్యాలయాలను, ఆరు టీవీ చానళ్లను, పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, ప్రధాని కార్యాలయాన్నీ స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.