కోర్టుకు హాజరైన మాజీ ప్రధాని
బ్యాంకాక్: అధికార దుర్వినియోగం కేసులో విచారణ కోసం థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా(46) మంగళవారం సుప్రిం కోర్టుకు హాజరయ్యారు. రైస్ సబ్సిడీ పథకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలను షినవత్రా ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు రుజువైతే పది ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే తన పై వచ్చిన ఆరోపణలు రాజకీయ కుట్రగా షినవత్రా అభివర్ణించారు. గత ఏడాది సైనిక తిరుగు బాటుతో బలవంతంగా గద్దెదిగారు. ఇప్పటికే షినవత్రా రాజకీయాల్లో 5 సంవత్సరాల వరకు నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు.