బ్యాంకాక్ : థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను అరెస్టు చేసేందుకు క్రిమినల్ కోర్టు రెండోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇంగ్లక్ ధాన్య సబ్సిడీ పథకంలో అవినీతి పాల్పడి, దేశానికి బిలయన్ల డాలర్ల నష్టం వాటిల్లేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మాజీ ప్రధానిపై రెండో అరెస్టు వారెంట్‌ను కోర్టు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ధాన్య సబ్సిడీ పథకంలో అవినీతిపై పలుమార్లు కోర్టుకు హాజరైన ఇంగ్లక్ ఈ ఏడాది ఆగష్టులో దేశం విడిచి పారిపోయారు. విచారణ సందర్భంగా పథకంలో అవినీతి జరిగితే తన తప్పు ఎలా అవుతుందని, రాజకీయ కుట్ర వల్లే తనను బలి పశువును చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారని సమాచారం. అయితే ఆమె థాయ్‌లాండ్ నుంచి దుబాయ్‌కు ఎలా పారిపోయారన్న విషయం మాత్రం ఇప్పటివరకూ అంతు చిక్కడం లేదు. తాజా రిపోర్టుల ప్రకారం సెప్టెంబర్ 11న ఆమె దుబాయ్ నుంచి లండన్‌కు వెళ్లిపోయారని తెలిసింది.
2014లో ఇంగ్లక్ ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు కుట్ర పన్నిన ప్రస్తుత థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా దౌత్యంతో ఇంగ్లక్‌కు పట్టుకుంటామని ఇంటర్‌పోల్‌ను ఇందుకు వినియోగిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment