గద్దె దిగను: థాయ్ ప్రధాని
బ్యాంకాక్: రెండో రోజుల్లోగా పదవి నుంచి తప్పుకోవాలన్న విపక్ష డిమాండ్‌ను థాయ్‌లాండ్ ప్రధాని యింగ్లుక్ షినవత్రా తోసిపుచ్చారు. ఆ డిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. దేశంలో తిరిగి శాంతి నెలకొనేందుకు రాజ్యాంగానికి లోబడి తాను చేయగలింది ఏమైనా ఉంటే చేయడానికి సిద్ధమని సోమవారం విలేకర్లతో అన్నారు. ప్రజలు ఎన్నుకోని ప్రజామండలికి అధికారం కట్టబెట్టాలన్న విపక్ష నేత సుథెప్ థాగ్స్‌బాన్ డిమాండ్ రాజ్యాంగం ప్రకారం ఆచరణ సాధ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. మరోపక్క.. బ్యాంకాక్‌లో సోమవారం కూడా విపక్ష మద్దతుదారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు జరిగాయి. ప్రభుత్వ భవనం, మెట్రోపాలిటన్ పోలీస్ సంస్థల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వందలాది ఆందోళనకారులపై పోలీసులు రబ్బరు తూటాలు, బాష్పవాయివు ప్రయోగించారు.