
కియారా అద్వానీ, రామ్‌చరణ్
రామ్ చరణ్ ఏదైనా జోక్ చెప్పారా? లేక వర్కౌట్స్ సెషన్స్‌లో ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఇలాగే డౌట్స్ వస్తాయి కదూ... పక్కనున్న ఫొటోలో బాగా నవ్వుతున్న హీరోయిన్ కియారా అద్వానీని చూస్తే. ఇంతకీ చరణ్, కియారా వర్కౌట్స్ చేస్తోంది ఎక్కడో తెలుసా? థాయిలాండ్‌లో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ ప్యాకప్ కే బాద్ వర్కౌట్స్ చేయడానికి జిమ్‌కి వెళ్తున్నారట రామ్ చరణ్ అండ్ కియారా. ‘‘షూటింగ్ ప్యాకప్... నెక్ట్స్ కో–స్టార్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నా’’ అని రామ్ చరణ్‌తో కలిసి వర్కౌట్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కియారా.
Comments
Please login to add a commentAdd a comment