
బ్యాంకాక్
థాయ్‌లాండ్ దేశ రాజధాని. ప్రపంచ ప్రధాన నగరాలలో ఒకటిగా ఖ్యాతి గడించింది.
పేరులో నేముంది
థాయ్‌లాండ్ దేశ రాజధాని. ప్రపంచ ప్రధాన నగరాలలో ఒకటిగా ఖ్యాతి గడించింది. తప్పనిసరిగా సందర్శించదగ్గ టూరిస్ట్ ప్లేస్‌గా కూడా దీనికి పేరు. ఎనభై లక్షల జనాభా ఉన్న ఈ రాజధాని 15వ శతాబ్దం నుంచి రూపు దిద్దుకున్నదని ఆధారాలున్నాయి. బ్యాంగ్ అంటే నది ఒడ్డున ఉన్న గ్రామం అని అర్థం. కో అంటే ద్వీపం అని అర్థం. నది కాలువలు చుట్టు ముట్టినట్టుగా ఉండటంతో కాలక్రమంలో ఇది బ్యాంగ్‌కాక్ అయ్యింది.
‘మకాక్’ అనే వృక్షజాతి ఇక్కడ విస్తారం కనుక బ్యాంగ్ మకాక్ కాస్తా బ్యాంగ్‌కాక్ అయ్యిందని అంటారు. టూరిస్ట్‌ల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ నగరం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నా అందులో అధిక శాతం భారాన్ని కాలవల మీద సాగే నీటి బస్సులే మోస్తున్నాయి. అన్నట్టు బ్యాంకాక్ రెడ్‌లైట్ ఏరియాలకు కూడా ప్రసిద్ధం.