బ్యాంకాక్‌లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్‌ | 6 Foreign Tourist Mysterious Death In Bangkok Hotel | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో సంచలనం.. ఆరుగురు విదేశీయుల అనుమానాస్పద మృతి

Jul 17 2024 9:44 AM | Updated on Jul 17 2024 10:09 AM

6 Foreign Tourist Mysterious Death In Bangkok Hotel

బ్యాంకాక్‌: టూరిస్టుల స్వర్గధామం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఆరుగురు విదేశీయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరుగురు మంగళవారం(జులై 16) నగరంలోని ఓ హోటల్‌ గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. వీరంతా వియత్నాం దేశస్తులని సమాచారం.

అయితే వీరిలో ఇద్దరికి అమెరికా పాస్‌పోర్టులుండటం గమనార్హం. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు. వీరు శని, ఆదివారాల్లో వేరువేరుగా బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ హోటల్‌కు వచ్చి రెండు గదులు తీసుకున్నారు. అనంతరం మంగళవారం వారంతా ఒకే గదిలో చనిపోయి ఉండటం మిస్టరీగా మారింది. 

విదేశీయులు అనుమానాస్పదంగా మృతి చెందిన హోటల్‌ను ప్రధాని స్రెత్తా తవిసిన్‌ పరిశీలించారు. పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకుగాను ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరపాలని ప్రధాని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురితో పాటు వేరే ఎవరైన వ్యక్తి వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement