స్మగ్లింగ్ హబ్‌గా చెన్నై | Smuggling hub for the Chennai | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్ హబ్‌గా చెన్నై

Published Sun, Dec 15 2013 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

స్మగ్లింగ్ హబ్‌గా చెన్నై

స్మగ్లింగ్ హబ్‌గా చెన్నై

 = విచ్చలవిడి గా అక్రమరవాణా
 = చెన్నై విమానాశ్రయ అధికారుల నిర్లక్ష్యం
 = అదుపుచేయాలంటూ ప్రధాని కార్యాలయం మొట్టికాయ

 
చెన్నై, సాక్షి ప్రతినిధి :  చెన్నై విమానాశ్రయం అక్రమ రవాణాకు ఆలవాలంగా మారింది. బంగారు దిగుమతి, మాదక ద్రవ్యాల ఎగుమతుల వ్యాపారం జోరుగా సాగడం ప్రధాని కార్యాలయ వర్గాల్లోనే కలకలం రేపింది. ఉత్తరాలతో హెచ్చరికలు జారీ చేసే స్థితికి చేరుకుంది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే చెన్నైకి సంస్కృతి, సంప్రదాయాల నగరంగా పేరుంది. తమిళులకు ఆధ్యాత్మిక భావన సైతం మెండుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. తమిళనాడుకు ఇటువంటి అదనపు ఆకర్షణ ఉండటం చెన్నై మీనంబాకం విమానాశ్రయంపై కూడా ఎంతో కొంత ప్రభావం పడుతోంది.

పలురంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుంటారు. సాత్వికతతో కూడిన నగర ప్రతిష్టను స్మగ్లింగ్ ద్వారా సొమ్ముచేసుకునేందుకు అక్రమార్కులు సిద్ధమవుతున్నారు. సింగపూర్, మలేషియా చెన్నైకి సమీపంలో ఉండడం, తమిళులు పెద్ద సంఖ్యలో ఆ దేశాల్లో స్థిరపడి ఉన్న కారణాలతో దాదాపు సొంత ఊరిగా భావించేస్థాయిలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే అదనుగా బంగారు బిస్కెట్లు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ సాగుతోంది.
 
ఏటా రూ.30 కోట్ల స్మగ్లింగ్

 ఈ రెండు దేశాలతోపాటూ దుబాయ్ వంటి అరబ్ దేశాలు, శ్రీలంక, బ్యాంకాక్ తదితర దేశాలతో స్మగ్లింగ్ ముడిపడింది. ఆరునెలలుగా బంగారం ధర విపరీతం గా పెరిగిపోవడం స్మగ్లింగ్‌కు దారితీసిం దని చెన్నైకి చెందిన ఒక హోల్‌సేల్ బం గారు వ్యాపారి ఆందోళన వ్యక్తం చేశాడు. ఏడాదికి రూ.30 కోట్లకు పైగా విలువైన బంగారు అక్రమ మార్గంలో తమిళనాడు మార్కెట్‌కు చేరుకుంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి నిదర్శనంగా ఇటీవల అనేక వినూత్న పద్ధతుల్లో బంగారు స్మగ్లింగ్ చేస్తున్న వారిని చెన్నై విమానాశ్రయం అధికారులు పట్టుకున్నా రు. ఒక కేసులో చెన్నై అధికారుల పాత్రకూడా ఉన్నట్లు స్పష్టమైంది.

అరబ్ దేశం నుంచి చెన్నై, చెన్నై నుంచి ముంబయికి భారీస్థాయిలో బంగారం చేరవేసేలా ముగ్గురు స్మగ్లర్లు పథకం పన్నారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తం కావడంతో ఇద్దరు మాత్రమే పట్టుబడ్డారు. మూడో వ్యక్తి గురించి ఆరాతీయగా తాము దిగిన విమానంలోనే ముంబాయి వెళ్లిపోయాడని పట్టుబడినవారు చెప్పారు. అధికారులు విమానంలోకి వెళ్లి తనిఖీ చేయగా టాయ్‌లెట్‌లో భద్రపరిచిన బంగారు దొరికింది.

మరో దేశం నుంచి వచ్చిన విమానమే ముంబయి వెళుతుందన్న సమాచారం స్మగ్లర్లకు అందడం, ప్రతి ప్రయాణానికి ముందు గా శుభ్రం చేయాల్సిన టాయిలెట్‌లో బంగారును సురక్షితంగా భద్రపరచడాన్ని చూసి అధికారులు అవాక్కయ్యూ రు. విమానంలో కూర్చుండిపోయిన మూడో నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ స్మగ్లింగ్ చేసినందుకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తారని మరో కేసులో ఇద్దరు నిరుద్యోగులు అంగీకరించారు. చెన్నై నుంచి సింగపూర్, మలేషియా, కౌలాలంపూర్‌కు టూరిస్టు వీసాలో అత్యధికులు పర్యటిస్తుంటారు. స్మగ్లర్లు సైతం ఇదే మార్గాన్ని ఎంచుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
 
48 కిలోల మాదక ద్రవ్యాల తరలింపు

సింగపూర్, మలేషియా, దుబాయ్, అరబ్ దేశాల నుంచి చెన్నైకి బంగారు దిగుమతి అవుతోంది. చెన్నై నుంచి శ్రీలంక, బ్యాంకాక్, మలేషియా తదితర దేశాలకు మాదక ద్రవ్యాలు ఎగుమతి అవుతున్న ట్లు గుర్తించారు. గత నెలలో చెన్నై మన్నాడికి చెందిన కాజా 48 కిలోల మాదకద్రవ్యాలతో చెన్నై నుంచి కౌలాలంపూర్‌కు చేరుకుని అక్కడి అధికారులకు పట్టుబడ్డాడు. ఇటువంటి సంఘటనలు ప్రధా ని కార్యాలయంలోనే కలకలం రేపా యి.

డిల్లీలోని భారత విమాన సర్వీసుల కా ర్యాలయం వారు చెన్నై విమానాశ్రయ డెరైక్టర్ సురేష్‌కు, కస్టమ్స్ అధికారులకు హెచ్చరికలు, ఆదేశాలతో కూడిన ఉత్తరాన్ని శనివారం పంపారు. చెన్నై విమానాశ్రయ పరిధిలో స్మగ్లింగ్ పెచ్చుమీరిపోయింది, కట్టడి చేయండని అందులో సా రాంశం. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యూరు. ఇంటర్నేషనల్ టెర్మినల్‌తోపాటూ డొమెస్టిక్ టెర్మినల్‌పై కూడా నిఘా పెంచారు. ప్రయాణికు ల తనిఖీని మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటి వరకు పట్టుబడిన వారి వెనుకనున్న బడాబాబుల బాగోతాలను వెలికి తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యూరు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement