
37 యు.ఎస్. డాలర్‌లు అంటే సుమారుగా 2,700 రూపాయలు. థాయ్‌లాండ్ కరెన్సీలోనైతే 1,200 బ్యాత్‌లు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మహిళా ‘మోర్సాయ్’ లు (మోటార్ టాక్సీ డ్రైవర్‌లు) రోజుకు పన్నెండొందల బ్యాత్‌లు సంపాదిస్తున్నారు! అంటే మన రూపాయిల్లో నెలకు సుమారుగా 80,000. ఇది పెద్ద మొత్తమే కానీ, వీరు పడే శ్రమ చిన్నదేం కాదు. బ్యాంకాక్ నగరంలోని మోసకారి గతుకు రోడ్లు, గోతుల నుంచి తప్పించుకుని వెనక సీట్లోని ప్రయాణికురాలిని (ఒక్కోసారి ప్రయాణికుడిని) భద్రంగా, సమయానికి గమ్యస్థానం చేర్చడానికి ఎంత నేర్పు, ఎంత ఒడుపు, ఎంత చొరవ కావాలో కదా. ఇక కార్లయితే కనికరం లేకుండా, పక్క వాహనాలకు కూడా దారి ఇవ్వకుండా తమ తోవ తాము చూసుకుంటూ దూసుకెళుతూ ఉంటాయి
వాటి మధ్యలోంచి మోర్సాయ్‌లు కట్‌లు కొట్టుకుంటూ వెళ్లాలి. అయినప్పటికీ ‘మోర్సాయ్’ని ఒక కెరీర్‌గా ఎన్నుకుంటున్న బ్యాంకాక్ యువతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆ వృత్తిలో లభించే గౌరవం, స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్య్రం.. వీటికి యువతులు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ప్రస్తుతం ఆ సిటీలో ‘మోర్సాయ్’లుగా రిజిస్ట్రర్ అయిన వారి సంఖ్య 98,000 మంది ఉండగా, వారిలో 30 శాతం వరకు మహిళలే. అయితే ఇంతకన్నా ఎక్కుమంది మహిళలే ఉంటారని థాయ్‌లాండ్ మోటార్‌సైకిల్ టాక్సీ అసోసియేషన్ అంటోంది. షర్ట్‌పై ఆరెంజ్ జాకెట్‌లు వేసుకుని రోడ్లపై ‘ర య్’మని వెళుతూ కనిపిస్తున్న వీళ్లను బ్యాంకాక్ ప్రజలు ఇప్పుడు ‘రోడ్ వారియర్స్’ని పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment