బ్యాంకాక్‌కు భారత షట్లర్లు | Indian badminton team leaves for Thailand | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌కు భారత షట్లర్లు

Jan 4 2021 1:13 AM | Updated on Jan 4 2021 2:51 AM

Indian badminton team leaves for Thailand - Sakshi

ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో సింధు

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలలో పాల్గొనేందుకు భారత బృందం బ్యాంకాక్‌ పయనమైంది. ఈనెల 12–17 వరకు యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీతో పాటు... 19 నుంచి 24 వరకు జరిగే టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీలో ఆడేందుకు భారత్‌ నుంచి స్టార్‌ షట్లర్లు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్‌ బయలుదేరారు. వీరి వెంట డబుల్స్‌ ప్లేయర్లు సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, సింగిల్స్‌ ఆటగాళ్లు ప్రణయ్, కశ్యప్, సమీర్‌ వర్మ, ధ్రువ్‌ కపిల, మనూ అత్రి  కూడా వెళ్లారు. లక్ష్యసేన్‌ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్నాడు.   

లండన్‌ నుంచి సింధు
గత అక్టోబర్‌ నుంచి లండన్‌లోనే ఉంటూ అక్కడే ప్రాక్టీస్‌ చేసిన ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు లండన్‌ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్‌ చేరనుంది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు సింధుతో కలిసి తీసుకున్న ఫోటోను ఇంగ్లండ్‌ డబుల్స్‌ ఆటగాళ్లు బెన్‌ లేన్, సీన్‌ వెండీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.
ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో సింధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement