
హీరోయిన్ బ్యాగ్ స్నాచింగ్
స్నేహితులతో జాలీగా గడిపేందుకు బ్యాంకాక్ వెళ్లిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది.
స్నేహితురాళ్లతో కలిసి జాలీగా గడిపేందుకు బ్యాంకాక్ వెళ్లిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మొబైల్ ఫోన్, ఐడీ కార్డ్, ఇతర వస్తువులు పోగొట్టుకుంది. ఇద్దరు ఆగంతకులు ఆమె లాక్కుపోయారు. రద్దీగా ఉండే రోడ్డులో స్నేహితులతో కలిసి వెళుతుండగా ఆమె బ్యాగును ఎత్తుకు పోయారు.
ఈ సంఘటన గురించి రకుల్ చెబుతూ... 'రెండు రోజులు హాయిగా గడుపుదామని ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లా. మేము తుక్ తుక్ ప్రాంతంలో ఉండగా బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నా బ్యాగు లాక్కుపోయారు. ఈ సమయంలో మేము ఏమీ చేయలేకపోయాం. తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. నా బ్యాగు తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు' అని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది.