Panic
-
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్‌కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్‌లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
బీఎఫ్.7.. కరోనా ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్. ప్రస్తుతం చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు కొత్తేం కాదు. అక్టోబర్‌లోనే బిఎఫ్.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ సబ్ వేరియెంట్ అత్యంత బలమైనది. కరోనా సోకి యాంటీబాడీలు వచ్చిననవారు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఎదిరించి మరీ ఇది శరీరంలో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అందుకే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లో జనవరిలో థర్డ్ వేవ్ వచ్చిన సమయంలో ఒమిక్రాన్‌లోని బిఏ.1, బీఏ.2 సబ్ వేరియెంట్లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ.4, బీఏ.5లని కూడా చూశాం. ఇన్నాళ్లు అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ ప్రజల్లో కరోనాని తట్టుకునే రోగనిరోధక వ్యవస్థలేదు. అదే ఇప్పుడు చైనా కొంప ముంచింది. వాస్తవానికి ఇప్పుడు చైనాలో నెలకొన్నలాంటి స్థితిని దాటి మనం వచ్చేశామని కోవిడ్–19 జన్యుక్రమ విశ్లేషణలు చేసే సంస్థ ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. 2021 ఏప్రిల్–మే మధ్యలో డెల్టా వేరియెంట్‌తో భారత్‌లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని, ఆ సమయంలో కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. ఇక ఒమిక్రాన్‌లో బీఎఫ్.7 చైనాలో అత్యధికంగా వృద్ధుల ప్రాణాలు తీస్తోందని, మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉండడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్ అగర్వాల్ చెబుతున్నారు. అయితే విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బీఎఫ్.7తో భారత్‌కు ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులంటున్నారు. ఈ సబ్ వేరియెంట్ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్‌లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి. చదవండి: దేశంలో క్యాన్సర్ విజృంభణ -
భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!
India has asked its citizens living in Ukraine not to panic: రష్యా ఉక్రెయిన్ల ఉద్రిక్తల నడుమ రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉంచిందంటూ వరుస కథనాలు వస్తున్నాయి. ఓ పక్కన అమెరికా యుద్ధం తప్పదు అంటూ వరుస హెచ్చరికలు జారి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను వచ్చేయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారతీయ విద్యార్థులు సమయాత్తమయ్యారు కూడా. అయితే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రజలకు విమానాలు అందడం లేదని ట్విట్టర్లో పేర్కొంది. దీంతో కేంద్రం పౌరులను విమాన టిక్కెట్లు దొరకడం లేదని భయపడవద్దు మరిన్ని విమానాలను పంపిచేందుకు యత్నిస్తున్నాం అని తెలిపింది. అయితే ఉక్రెయిన్ నుండి భారతదేశానికి విమానాలు అందుబాటులో లేవని భారత రాయబార కార్యాలయానికి అనేక విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత రాయబార కార్యాలయం "విద్యార్థులను భయాందోళనలకు గురికావద్దని, భారత్‌కు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న అనుకూలమైన విమానాలను బుక్ చేసుకోండి" అని ట్వీట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్ మొదలైనవి విమానాలను నడుపుతున్నాయి" పేర్కొంది. పైగా ఎయిర్ ఇండియా, ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా "సమీప భవిష్యత్తులో మరిన్ని విమానాలు నడిపేందుకు యత్నించనుందని కూడా వెల్లడించింది. అంతేకాదు ఏదైనా సమాచారం లేదా సహాయం కోసం భారత విదేశీ వ్యవహారాల మంతత్రిత్వ శాఖను సంప్రదించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం 24 గంటల హెల్ప్‌లైన్‌ని కూడా ఏర్పాటు చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత మాస్కో అధీనంలో ఉన్న క్రిమియాలో సైనిక కసరత్తులు ముగిశాయని, సైనికులు తమ స్థావరాలకు తిరిగి వస్తున్నారని తెలపడం విశేషం. కానీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. మాస్కో మరిన్ని బలగాల ఉపసంహరణను ప్రకటించినప్పటికీ రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ చుట్టూ మోహరించే ఉన్నాయని, సైనిక కసరత్తు కొనసాగుతోందని పేర్కొనడం గమనార్హం. (చదవండి: ఉక్రెయిన్ ఉద్రిక్తతలు: భారతీయ విద్యార్థులకు చుక్కలు.. పరిస్థితి చెయ్యి దాటిందంటూ ఆవేదన) -
లక్నోలో విష జ్వరాల విజృంభణ: ఆందోళనలో బాధితులు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అంతుచిక్కని, విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ వైరల్ ఫీవర్స్‌తో ఇప్పటికే చాలామంది ఆసుపత్రుల పాలవ్వగా రాజధాని నగరం లక్నోలో పలు ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడు తున్నాయి. 40 మంది పిల్లలు సహా, 400 మందికి పైగా చేరడం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో గత వారం రోజుల్లో వైరల్ జ్వరాల పీడితుల సంఖ్య 15 శాతం పెరిగింది. వాతావరణ మార్పులతో వస్తున్న సాధారణ ఫ్లూ అని అందోళన అవసరం లేదని వైద్యులు చెబుతునప్పటికీ, కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతుండటం తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలైంది. నగరంలోని బలరాంపూర్ సివిల్ ఆసుపత్రి, లోహియా ఇన్స్టిట్యూట్లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వీటితోపాటు మహానగర్ భౌరావ్ దేవరాస్, రాణి లక్ష్మీబాయి, లోక్‌బంధు, రాంసాగర్ మిశ్రా, మ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా జ్వర పీడితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా పీడియాట్రిక్స్ విభాగంలో బాధితులు క్యూ కడుతున్నారు. అలాగే పాథాలజీలో, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరం, ఇతర సంబంధిత వ్యాధుల కేసులలో 20 శాతం పెరుగుదల కనిపిస్తోందని సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ ఎస్కె నందా తెలిపారు. -
ఈ రోజు వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి.. ఎందుకో తెలుసా?
సాక్షి,సెంట్రల్ డెస్క్: అదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం.. ఓ రోజు అర్ధరాత్రి.. పక్కనే ఏముందో కూడా కానరానంతగా చిమ్మచీకటి కమ్ముకుంది.. అంతా నిశ్శబ్దం.. కానీ ఒక్కసారిగా ఏదో అలజడి. ఓ మందలోని గొర్రెలన్నీ కంచెను విరగ్గొట్టుకుని మరీ బయటికి పరుగెత్తడం మొదలుపెట్టాయి. కొంత దూరంలో ఉన్న మరో మందలోనూ ఇది మొదలైంది. కాసేపటికే చుట్టూ ఉన్న ఊర్లలోనూ అదే పరిస్థితి.. పదులు, వందలు కాదు.. వేలకొద్దీ గొర్రెలు.. ఒకే సమయంలో ఉన్నట్టుండి పిచ్చిపట్టినట్టు వగరుస్తూ పరుగెత్తాయి. మందలు ఉన్న కంచెలపై నుంచి దూకి, కొన్నిచోట్ల కంచెలను విరగ్గొట్టుకుని పారిపోయాయి. మధ్యలో పంటలను, తోటలను అన్నింటినీ ధ్వంసం చేసేశాయి. గొర్రెల యజమానులు పొద్దున లేచిచూసే సరికి.. మందలన్నీ ఖాళీ. ఇదేమిటని వెతకడం మొదలుపెడితే.. కిలోమీటర్ల దూరంలో మైదానాలు, పొదల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. కొన్ని అప్పటికీ వగరుస్తూ, ఏదో భయం భయంగా ఉన్నట్టు కనిపించాయి. ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్షైర్ కౌంటీలో 1888 నవంబర్ 3న ఈ ఘటన జరిగింది. తర్వాత ఐదేళ్లకు 1893 డిసెంబర్ 4న మరోసారి ఇలాగే వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఈ ఘటనలు జనంలో తీవ్ర భయాందోళన రేకెత్తించాయి. అసలు ఏం జరిగిందన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ తేలని మిస్టరీ.. నిజానికి గొర్రెలు చాలా పిరికి జంతువులు. ముందు ఏదైనా చిన్నగా అడ్డంగా ఉన్నా దాటకుండా ఆగిపోతాయి. అలాంటిది ఏకంగా కంచెలను విరగ్గొట్టి మరీ పరుగెత్తడం, ఒకేసారి వేలకొద్దీ గొర్రెలు పారిపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ఆస్తులు, పంటలకు భారీగా నష్టం జరిగింది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదేమిటో తేల్చేద్దామని ప్రయత్నించారు. ఉరుములు, పిడుగులకు భయపడ్డాయని.. స్వల్ప స్థాయి భూకంపం వచ్చి ఉంటుందని.. అడవి జంతువులు దాడిచేసి ఉంటాయని.. ఎవరో కావాలని అలా చేసి ఉంటారని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్తూ వచ్చారు. కానీ ఇవేవీ ఆ ఘటనను సరిగా తేల్చలేకపోయాయి. ఎందుకంటే.. గొర్రెలు పరుగెత్తింది ఒకటీ రెండు చోట్ల నుంచి కాదు.. పదుల సంఖ్యలో గ్రామాల నుంచి.. సుమారు 500 కిలోమీటర్ల వైశాల్యంలో ఒకే సమయంలో వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఆ రోజు ఉరుములు, మెరుపులు, తుపాను వంటివేమీ రాలేదు కూడా. నల్లటి మేఘం కమ్మేసి.. ఈ ఘటన గుట్టు తేల్చేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారు. అయితే ఈ ఘటనపై స్థానిక అధికారులు ప్రభుత్వానికి రాసిన ఓ లెటర్లో కాస్త ఆసక్తికర అంశం ఒకటి ఉంది. ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు కూడా.. ఆకాశంలో పెద్ద నల్లటి మేఘం కనిపించింది. మెల్లగా ఆ ప్రాంతమంతా ఆవరించింది. పక్కనే ఎవరు ఉన్నారో కూడా తెలియనంతగా చిమ్మ చీకటి కమ్ముకుంది. కాసేపటికే గొర్రెలన్నీ పారిపోవడం మొదలైంది. దీన్ని ఆధారంగా చేసుకునీ శాస్త్రవేత్తలు ఓ ప్రతిపాదన చేశారు. అసలేమీ కనిపించని చీకటి కారణంగా.. తమనెవరో బంధించారని, ఏదో జరగబోతోందని గొర్రెలు భయపడ్డాయని, కొన్ని గొర్రెలు అటూఇటూ పరుగెత్తడంతో మిగతావీ బెదిరి పారిపోయి ఉంటాయని పేర్కొన్నారు. ఇదీ జస్ట్ ఓ అంచనా మాత్రమే. అసలేం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే.. చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్ వెంటే.. -
బాత్రూంలో ప్రసవం.. భయంతో బిడ్డను
న్యూయార్క్ : ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే కన్నతల్లి తన బిడ్డపై చూపించే ప్రేమ ఒకేలా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా బిడ్డకు మాత్రం హాని తలపెట్టదు. తాను కష్టాలు ఎదుర్కొనైనా సరే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కన్నతల్లి ప్రేమ అలాంటిది. కానీ ఇక్కడ ఒక కన్నతల్లి మాత్రం అప్పుడే పుట్టిన పసికందును కిటీకీలోంచి విసిరేసి మాతృత్వం అనే పదానికి కళంకం తెచ్చింది. ఈ హృదయవిదారక ఘటన అక్టోబర్ 10న అమెరికాలో న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. (చదవండి : రాక్షసి: గర్భిణిని చంపి, బిడ్డను తీసుకొని...) వివరాలు ... న్యూయార్క్‌లోని క్వీన్స్ ఏరియాలో భారత సంతతికి చెందిన అమెరికా 23 ఏండ్ల యువతి సబితా దూక్రమ్ భర్తతో కలిసి నివసిస్తుంది. గర్భవతి అయిన సబితా దూక్రమ్ ఈనెల 10న బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ప్రసవించింది. భయంతో ఏం చేయాలో తెలియక అప్పుడే పుట్టిన పసికందును బాత్రూం వెంటిలేటర్ నుంచి బయటికి విసిరేసింది. అనంతరం బాత్రూంను శుభ్రపర్చి స్నానం చేసి యధావిథిగా వచ్చి బెడ్‌పై పడుకుంది.అయితే పసికందు ఏడుపు శబ్ధం విన్న ఇరుగుపొరుగు వారు ఆ పసికందును ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసవించిన విషయాన్ని కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని అడిగిన ప్రశ్నకు సబితా దూక్రమ్ చెప్పిన సమాధానం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. అసలు ఈమె కన్నతల్లేనా అనే అనుమానం కూడా వస్తుంది. 'నేను బాత్రూం వెళ్లి స్నానం చేస్తుండగా బాబు పుట్టాడు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది. బాత్రూంలో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కట్‌చేసి బాబును బయటికి విసిరేశా. ఆ తర్వాత నా దుస్తులను బాత్రూంలోని వాషింగ్‌మెషిన్‌లో పడేసి, బాత్రూంను శుభ్రంగా కడిగి బయటికి వచ్చి బెడ్రూంలో పడుకున్నా' అని చెప్పింది. అసలు సబితా దుక్రమ్ భయంతో నిజంగానే బిడ్డను పారేసిందా లేక మతిస్థిమితం తప్పి అలా ప్రవర్తించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంలో సబితా దూక్రమ్ను కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. (చదవండి : హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు) అయితే యువకుని తల్లి వివరాల మేరకు సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి, కొడుకులు ఆటోలో కలసి బయలుదేరారు. అసెంబ్లీ భవన్ వద్దకు చేరుకోగానే యువకుడు సైకోలాగా ప్రవర్తిస్తూ బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసుకొని ఆటో నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత తల్లి మెడపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పాటు బీజేడీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశాడు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని అతని వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకొని తల్లిని విడిపించి యువకుడిని కస్టడీలోకి తీసుకున్నారు. యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళుతుండగా.. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దశ్ పేర్కొన్నారు. కాగా యువకుడు కత్తితో సైకోలాగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : భారీ చేపతో బామ్మకు జాక్‌పాట్) -
నడిరోడ్డు మీద గాల్లోకి కాల్పులు జరుపుతూ..
లక్నో: ఓ వ్యక్తి సడెన్‌గా కారు నుంచి దిగి.. దానికి నిప్పంటించాడు.. ఆపడానికి ప్రయత్నించిన జనాలను తుపాకీతో బెదిరించడంతో పోలీసులు అతడిని, అతనితో పాటు ఉన్న యువతిని అరెస్ట్ చేశారు. మధురలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. శుభం చౌదరి అనే యువకుడు, ఓ యువతితో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు ఉన్నట్టుండి ఆ యువకుడు కారు నుంచి దిగి.. దానికి నిప్పంటించాడు. అదుపు చేయడానికి వచ్చిన వారిని గన్నుతో బెదిరిస్తూ.. గాల్లోకి కాల్పులు జరిపి వీరంగం సృష్టించాడు. అతడి చర్యల వల్ల ట్రాఫిక్ జాం అయ్యి.. జనాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేయడమే కాక.. కాసేపు అవినీతి గురించి ఉపన్యసించాడు. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శుభం చౌదరిని, అతడితో పాటు ఉన్న యువతిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కారును ఎందుకు తగలబెట్టావని శుభం చౌదరిని ప్రశ్నించగా అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అంతేకాక తనతో పాటు ఉన్న యువతిని కాసేపు తన చెల్లెలు అని, కాసేపు బిజినేస్ పార్టనర్ అని, కాసేపు ఫ్రెండ్ అన్నాడు. శుభం చౌదరి మాటలు విన్న పోలీసులు అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని భావిస్తున్నారు. మరో సమాచారం ఏంటంటే శుభం చౌదరికి వేరే మహిళతో వివాహం నిశ్చయమైందని.. కానీ కారులో ఉన్న యువతితో అతనికి సంబంధం ఉండటం మూలానా ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని... దాంతో శుభం చౌదరి డిప్రెషన్లోకి వెళ్లాడని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని తెలిసింది. దీని గురించి పోలీసులను ప్రశ్నించగా.. పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
కశ్మీర్లో ఏం జరుగుతోంది..?
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో యాత్రికులు, సందర్శకులను వెనక్కిరావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం భద్రతా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో కశ్మీర్లో భయాందోళనలు అలుముకున్నాయి. ప్రభుత్వ సూచనతో అమర్నాథ్ యాత్రికులు, సందర్శకులు తమ స్వస్ధలాలకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు, యాత్రికులు సైతం ఇంటిబాట పట్టారు. మరోవైపు జమ్ము కశ్మీర్ పరిణామాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. వదంతులను నమ్మరాదని రాజకీయ పార్టీల నేతలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కశ్మీర్లో నెలకొన్న పరిస్థితిపై మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ యాత్రికులు, సందర్శకులు, కార్మికులు, విద్యార్ధులు, క్రికెటర్లను ఖాళీ చేయిస్తూ ఉద్దేశపూర్వకంగా భయోత్పాతాన్ని సృష్టిసున్నారని, కశ్మీరీలకు భద్రత, ఊరట కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని అన్నారు. మానవతావాదం, కశ్మీరియత్‌లు ఎక్కడకు పోయాయని ఆమె ట్వీట్ చేశారు. -
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. తీవ్ర భయాందోళన!
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి వద్ద శనివారం ఉదయం నడిరోడ్డు మీద పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. పిల్లర్ నంబర్ 273 వద్ద ఫుల్ లోడ్‌తో ఉన్న ట్యాంకర్ బోల్తాపడటంతో రోడ్డు నిండా పెట్రోల్ లీకవుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని పెట్రోల్ పారిన చోట నీళ్లు చల్లారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించారు. సంఘటనాస్థలికి సమీపంలోని కాలనీవాసులను ఖాళీ చేయించారు. ట్రాఫిక్‌ను కూడా దారిమళ్లించారు. దీంతో మెహిదీపట్నం నుంచి ఆరాంగర్ రూట్లో ప్రయాణికులు మొదట ఇబ్బంది ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పీవీఎక్స్ప్రెస్వేపైనా తాత్కాలికంగా రాకపోకలను నిలిపేశారు. అనంతరం పోలీసులు, సహాయక సిబ్బంది బోల్తా పడిన ట్యాంకర్‌ను తొలగించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ అయింది. వాహనాలు ప్రస్తుతం యథాతథంగా రాకపోకలు సాగిస్తున్నాయి. -
ఆ పెద్దాయన కోరిక ఎంత పని చేసింది..!
సాక్షి, ముంబై: విమాన ప్రయాణ నిబంధనల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఓ పెద్దాయన ..ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాదు తోటి ప్రయాణీకుల గుండెల్ని గుభేల్మనిపించారు కూడా. ఆయన చేసిన పనికి అకస్మాత్తుగా విమానంలో గందరగోళం, భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దు మణిగింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే హర్యానాలోని ఇజ్జర్ నివాసి రాజ్‌కుమార్ లక్ష్మీనారాయణ్ గార్గ్(65) మొదటిసారి విమానంలో ముంబై బయలుదేరారు. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యే నిమిత్తం అత్యవసరంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి జనవరి 9న రాయ్‌పూర్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో (6ఈ-802) బయలుదేరారు. ఇంతలో బీడీ తాగాలన్న కోరికను నియంత్రించుకోలేని లక్ష్మీనారాయణ్...వెంటనే విమానంలోని టాయ్లెట్లోకి దూరి, పనికానివ్వడం మొదలుపెట్టారు. అంతే..విమానంలో ఫైర్ అలారంలు తమ పని కానిచ్చాయి. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో వణికిపోయారు. సిబ్బంది పరిశీలనతో...పెద్దాయన వ్యవహారం బయటపడింది. వెంటనే వారు కెప్టెన్ రితేష్ మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్స్ నియమాలు, నిబంధనలు గురించి ఆయనకు కెప్టెన్ వివరించారు. అనంతరం విమానం ముంబై చేరున్నాక.. విమానాశ్రయం పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 336, ఎయిర్‌లైన్ రూల్ ఆఫ్ 25ఎ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో లక్ష్మీనారాయణ్, ఆయన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇళ్లల్లోకి చిరుత..పరుగులు తీసిన జనాలు
-
ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం
సాక్షి, డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఓ చిరుత చుక్కలు చూపించింది. పట్టపగలే ఇళ్లల్లోకి చొరబడి ముచ్చెమటలు పట్టించింది. మెరుపు వేగంతా జనాలపైకి దూసుకెళ్లి హడలెత్తించింది. చివరకు ఎవరి చేతికి చిక్కకుండా పరారైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని కేవల్ విహార్ ప్రాంతంలోని ఓ నివాస ప్రాంతంలోకి చిరుత ప్రవేశించింది. శాస్త్రబుద్ధి అనే రోడ్డులోని ఓ నివాసంలో గార్డెన్‌లోకి వెళ్లింది. అక్కడే కొద్ది సేపు కూర్చున్న చిరుత ఆ వెంటనే సెకన్లలో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి క్షణాల్లో దూకడం మొదలుపెట్టింది. దీంతో ఇళ్లల్లోని మహిళలు, ముసలివారు సైతం తమ శక్తిమేరకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉన్నవారిపైకి దూసుకెళ్లిన చిరుత నలుగురైదుగురిని చూసి మాత్రం భయపడింది. దీంతో జనాలంతా కూడా ఒకే చోట పోగయ్యారు. ఈ తంతు దాదాపు ఆరు గంటలపాటు జరిగింది. అయితే, కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు చిరుతకు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అక్కడికి వచ్చి గన్ సిద్ధం చేస్తుండగానే చిరుత కనిపించకుండా మాయమైంది. ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం -
‘మాకేం భయం లేదు.. మా ఏటీఎంలు ఫుల్లు’
శ్రీనగర్: దేశమంతా పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా ప్రజానీకమంతా భయందోళనకు, కంగారులోకి వెళ్లిపోగా కశ్మీర్లో ప్రజలు మాత్రం అదేం లేదన్నట్లు ఉన్నారు. పైగా ఈ సంస్కరణను వారు స్వాగతిస్తున్నారు. ‘సాధారణ పౌరుడు ఎవరూ కూడా పెద్ద మొత్తంలో డబ్బును ఇంట్లో ఉంచుకోడు. ఎందుకంటే మా ప్రాంతమంతా సమస్యల మధ్య ఉండే ప్రాంతం. ఉన్న డబ్బంతా బ్యాంకుల్లోనే ఉంచుకుంటాం’ అని కశ్మీర్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం బోధిస్తున్న ఎలిజబెత్ మార్యాం తెలిపారు. ‘నెలనెలా జీతభత్యాలు అందుకునేవారు బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకుంటారు. నిత్యావసరాలకు తగినంత మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇక నైపుణ్యం ఉన్న కార్మికులు, శ్రామికులు మాత్రం వారు ఎంత ఖర్చుపెట్టుకోగలరో అంతమాత్రమే ఇక్కడ సంపాదించుకోగలరు. ఇక బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉంచుకోరు. ఎందుకంటే ఇదంతా ఉద్రిక్తల నడుమ ఉండే ప్రాంతం కనుక. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కశ్మీర్ పై తక్కువ ప్రభావాన్ని చూపేందుకు ఇదే ప్రధానమైన కారణం కూడా’ అని ఆమె అన్నారు. ఇక నజీర్ ఖాజీ అనే జమ్మూ కశ్మీర్ బ్యాంకు అధికారి మాట్లాడుతూ తమ దగ్గర ఏటీఎంలన్నీ కూడా పూర్తిగా నింపేసి ఉంచామని, ఎక్కడా కూడా పెద్ద రద్దీ లేదని, బ్యాంకుల వద్దకు మాత్రం డబ్బును మార్పిడి చేసుకునేందుకు వస్తున్నారని చెప్పారు. అయితే, అంత ఇబ్బంది పడేంత పరిస్థితి మాత్రం తమ వద్ద లేదని వెల్లడించారు. -
బ్రహ్మగుండం ..క్షుద్ర నిలయం
–నాడు రవ్వల కొండ.. నేడు పులికుంట –మహిళలు, పిల్లలే టార్గెట్ –కోట్లకు పడగలెత్తిన మంత్రగాళ్లు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మంత్రగాళ్లు. మంత్రాలు, అంత్రాలు, క్షుద్రపూజలతో ఏ సమస్యనైనా తీరుస్తామని చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రవ్వలకొండ ప్రాంతంలో గూడూరు చిన్నమద్దమ్మ, ఎర్రకత్వ ప్రాంతంలో ఆమె కూతురు లక్ష్మిల హత్యోదంతం క్షుద్రపూజలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో క్షుద్రపూజలపై కథనం.. వెల్దుర్తి రూరల్ : క్షుద్రపూజలు, చేతబడులకు పట్టణ సమీపంలోని బ్రహ్మగుండం ఆలయ పరిసరాలు అడ్డాగా మారాయి. జనసంచారం తక్కువగా ఉండడంతో మంత్రగాళ్లకు పని సులవవుతోంది. బ్రహ్మగుండం పరిసరాలైన రవ్వలకొండలో కొనసాగుతున్న క్షుద్రపూజలు ఆ ప్రాంత రైతులు అభ్యంతరం తెలపడంతో పక్కనే ఉన్న పులికుంట సమీపంలోకి మార్చారు. ఇక్కడ చెట్లు, పాతకోనేరు ఎదురుగా పార్వతీదేవి ఆలయం, పక్కనే నీటి వసతి ఉండడంతో మంత్రగాళ్లకు కలసివస్తోంది. బలహీనతే పెట్టుబడి.. మండలానికి చెందిన ఇద్దరు క్షుద్రపూజలు చేసేవారిలో మొదటి వరుసలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరు కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. వీరు మొదట తమ గ్రామాల్లోని ఆలయాల వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని తమ పని మొదలెడతారని. వీరి అనుంగు శిష్యలైన ఒక మహిళ, మరొకతను ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వీరే బాధితులకు ఫలానా పూజలు నిర్వహించాలని, ఇంత మొత్తం ఖర్చువుతుందని నిర్ణయిస్తారని తెలుస్తోంది. గాలి సోకిందని, దయ్యం పూనిందని, చేతబడి జరిగిందని, కుటుంబ కలహాలతో ఇతరులను వశం చేసుకోవడానికని వచ్చిన మహిళలకు మంగళ, ఆదివారం, అమావాస్య రోజుల్లో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు సమాచారం. క్షుద్రపూజలు ఇలా.. బాధిత మహిళలు, చిన్నారులను పులికుంటలో(నీరుంటే) లేకపోతే వాటర్ హౌస్ పక్కనున్న గచ్చులో అభ్యంగ స్నానాలు చేయించి తడి బట్టలతో తాము పూజలకు సిద్ధం చేసుకున్న రతి(కుంకుమ, పసుపు, నిమ్మకాయలు వగైరాలతో వేసిన పిండి ముగ్గులు)లో దీపాలు వెలిగించి మధ్యలో కూర్చోబెడతారు. విపరీతమైన శబ్దాలతో దెయ్యం పారదోలుతున్నామంటూ వారిని స్పహ కోల్పేయే వరకు చెర్నకోలాలతో కొడతారు. అనంతరం వారి ఒంటిపై ఉన్న నగానట్రా తీసేసుకుని, వస్త్రాలు, చెప్పులతో సహా వాటిని మంటల్లో కాల్చి కొత్త వస్త్రాలను ధరింపజేస్తారు. జుట్టు, ఒంటిపై ఉన్న వస్త్రాన్ని కత్తిరించి వాటిని చెట్టుకు కడతారు. బలి అంటూ నల్లకోడిని కోసి రక్తం ఒక గిన్నెలో పోసి పూజ ముగిస్తారు. వారితో వచ్చిన వారికి ఇక బాగవుతుందని చెబుతూ కోడి రక్తాన్ని వారి ఇళ్లప్రాంతాలలో చల్లుకోవాలని, కోడి మాంసాన్ని పచ్చిగా ఆరగించమంటారు. క్షుద్ర పూజల తర్వాత కూడా మళ్లీ వస్తే పెద్ద పూజలు చేయాలని ఇందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వారిని వెళ్లగొడతారు. వీరి వద్దకు కర్నూలు జిల్లా నుండే కాక అనంతపురం, కడప, హైదరాబాద్‌లతో పాటు కర్ణాటక నుంచి కూడా మానసిక రోగస్తులు వస్తూండడం కొసమెరుపు. మచ్చుకు కొన్ని.. ––Ðð ల్దుర్తికి చెందిన ఓ వ్యక్తి కోడలికి గాలిసోకిందని మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లగా ఆమె వారి చేతుల్లో నరకయాతన పొంది మరణించినట్లు తెలిసింది. –– క్షుద్ర పూజల సందర్భంగా మంత్రగాళ్లు సష్టించిన భయానక వాతావరణంతో హైదరాబాద్ వాసి గుండెపగిలి ఒకరు మరణించగా అమ్మవారు నరబలి తీసుకుందని, కుటుంబ సభ్యులకు సైతం మరణం ఉందని భయపెట్టి బంగారు, లక్షల్లో పైకం వసూలు చేసినట్లు సమాచారం. –– రామళ్లకోట వాసులైన తల్లీకూతుళ్లు పాతకోనేరులో పడి మతి చెందిన ఘటన క్షుద్రపూజల కోణంలోనే జరిగినట్లు తెలిసింది. ––రామళ్లకోటలో ఐరన్ అక్రమ తవ్వకాలతో కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి గ్రామంలో తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుడైన యువకుడిని బలిచ్చి విషయం పొక్కకుండా వారి కుటుంబానికి డబ్బులిచ్చినట్లు సమాచార ం. -
ఎనిమిది సింహాలు జనాల మధ్యకొచ్చి గర్జిస్తే..
అహ్మదాబాద్: జూలో ఉన్న సింహాలు గర్జిస్తేనే ఒళ్లంతా వణికిపోతుంది. అలాంటిది ఏకంగా రోడ్లపైకి, జనాల మధ్యలోకి వచ్చి గర్జిస్తే పరిస్థితి ఏమిటి? అది కూడా ఏకంగా ఎనిమిది సింహాలు ఆ పనిచేస్తే ఇంకేమైనా ఉంటుందా.. గుజరాత్లో ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీధి కుక్కల మాదిరిగా ఇప్పుడు సింహాలు గిర్ సోమనాథ్ జిల్లాలోని జునాఘడ్ పట్టణం సమీపంలో హల్ చల్ చేస్తున్నాయి. కనిపించినవారిపై వరుసదాడులు చేస్తున్నాయి. రెండు సింహపు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది సింహాలు జునాఘడ్ పట్టణంలోని నివాస ప్రాంతంలో రాత్రిపూట సంచరిస్తుండగా ఓ వ్యక్తి వాటిని సెల్ ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఇప్పుడు అక్కడి చుట్టుపక్కల వారు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. అమ్రేలీ జిల్లాలో మంగళవారం రాత్రి అడ్సాంగ్ అనే ప్రాంతంలో గొర్రెల కాపరిపై ఓ మూడు సింహాలు దాడి చేయడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అలాగే, ఇదే ఏడాది మార్చి, మే నెలలో జరిగిన సింహాల దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గిర్ వన్యమృగ క్షేత్రం నుంచి ఈ సింహాలు తప్పించుకొని వచ్చినట్లు సమాచారం. -
భూకంపం భయంతో దూకేసింది
శ్రీనగర్: దేశాన్ని కుదిపేసిన భూకంపం కశ్మీర్‌లోని కాలేజీలు, ఇతర విద్యాలయాల్లో కూడా ఉద్రిక్తతను రాజేసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఓ కాలేజీ విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని ఓ అమ్మాయి కాలేజీ హాస్టల్ మొదటి అంతస్తు నుంచి దూకేసింది. ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోయినా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎంఎ రోడ్ విమెన్స్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ అమ్మాయిలంతా వైవా టెస్టుకు ప్రిపేర్ అవుతున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఇంతలో ఆకస్మాత్తుగా భూమి కంపించడాన్ని గమనించిన విద్యార్థినులు బయటికి పరుగులు తీశారు. బీఎ మొదటి సంవత్సరం చదువుతున్న మరో అమ్మాయి మాత్రం ఈ గందరగోళంలో హాస్టల్ భవనం నుంచి దూకేసింది. ఈ వార్తను ధ్రువీకరించిన కాలేజీ ప్రిన్సిపల్.. ఆమెను ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన అమ్మాయిగా గుర్తించామని, ఆమె బంధువులకు సమాచారం అందించామని తెలిపారు. అటు భూకంపం వార్తలతో తల్లిదండ్రులు కూడా స్కూళ్లకు పరుగులు పెట్టారు. తమ బిడ్డలను కళ్లారా చూసేదాకా వారి ప్రాణాలు నిలువలేదు. తాను స్కూలుకెళ్లేసరికి పిల్లలు, టీచర్లు అంతా షాక్ లో ఉన్నారని, అక్కడి పరిస్థితి అంతా గందరగోళంగా, అయోమయంగా ఉందని జావేద్ అహ్మద్ అనే పేరెంట్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు పరిస్థితి అదుపులో ఉందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షా ఫజల్ తెలిపారు. విద్యాలయాల నుంచి నివేదికలు సేకరిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. -
సార్.. మమ్మల్నీ చంపేస్తారేమో..!
ధర్మవరంలో నరకం అనుభవించాం.. బాకీ తీరిస్తేనే మగ్గాల నుంచి బయటకు.. ఇక్కడికి వచ్చినా వెంటాడి వేటాడారు.. భయాందోళనకు గురవుతున్న బాధితులు, వలస చేనేత కార్మికులు కురబలకోట : ‘సార్.. మా వాడు రవి వీవర్స్ దారుణనానికి బలయ్యాడు.. మమ్మల్ని కూడా చంపేస్తారేమో.. భయమేస్తోంది..’ అంటూ ధర్మవరం నుంచి మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వలస వచ్చిన చేనేత కార్మికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ధర్మవరం నుంచి వచ్చిన ఏ.రవి దారుణ హత్యకు గురికాగా, ఆదివారం అమ్మచెరువు మిట్ట వినాయక చేనేతనగర్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న విషయం విదితమే. మద నపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సోమవారం బాధిత కుటుం బీకులను రూరల్ సీఐ మురళి విచారించారు. ధర్మవరంలో మాస్టర్ వీవర్స్ సొసైటీని నాగరాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని, ఇతనికి వందలాది మగ్గాలు కూడా ఉన్నాయని బాధితులు వివిరించారు. ఇతని వద్ద పనిచేసే వారికి అప్పు ఇస్తాడని, ఆ తర్వాత తీర్చకపోతే బయటకు వదలడని.. దీంతో నరకం అనుభవించాల్సిందేనని వాపోయారు. బాకీ తీరే వరకు వెట్టి చాకిరీ చేయాల్సిందేనన్నారు. కార్మిక, చేనేత, జౌళి శాఖల అధికారులు విచారణ జరిపినా తూతూమంత్రంగానే ఉంటాయని చెప్పారు. అతనంటే అందరికీ భయమేనన్నారు. ఎదు రు తిరిగితే శాల్తీలు గల్లంతవుతాయని హెచ్చరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇతని బారి నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రజాప్రతినిధికి మద్దతు పలకగా అద ృష్టవశాత్తు గెలిచాడన్నారు. ఆయన చొరవతో 500 మంది దాకా వీవర్స్ నిర్వాహకుడి వెట్టి నుంచి బయటపడ్డారన్నారు. తర్వా త తలో దిక్కుకు వెళ్లి బతుకు జీవుడా.. అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా 20 కుటుంబాల వాళ్లం రెండు నెలల క్రితం మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వచ్చామన్నారు. ఇక్కడ ఇంకా సరిగ్గా కుదురుకోకనే ధర్మవరం వీవర్స్ సొసైటీ వారు ఓర్వలేక పోయారని, వెంటాడి రవిని హత్య చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బతకనీయకుండా చే స్తే ఇక మేమెక్కడ బతకాలని వేదన పడ్డారు. స్పందించిన సీఐ.. ఎలాంటి దౌర్జన్యాలు జరక్కుండా చూస్తామని ధైర్యం చె ప్పారు. రవి హత్యకు ధర్మవరంలోని వీవర్స్ సొసైటీ నిర్వాహకులే కారణమని విచారణలో తేలిందన్నారు. రెండు, మూడు రోజుల్లో హంతకులు ఎవరన్నది తెలుస్తుందన్నారు. త్వరలోనే ఈ హత్య కేసును ఛేదిస్తామన్నారు. ఎన్నాళ్లున్నా గొర్రె తోక చందమే.. చేనేత కార్మికుడికి చచ్చే వరకు సగం గుంత.. చచ్చాక నిండు గుంతన్నది.. నానుడిగా ఉంది. వారి జీవితాల్లో అక్షర సత్యంగా ఉంటోంది. చేనేత కార్మికులు సగం గుంతలోనే మగ్గాలు వేయాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి చేస్తున్నా గొర్రె తోక చందంగా ఎదుగుబొదుగూ లేదని కార్మికులు వాపోయారు. -
జీజీహెచ్‌లో భద్రత డొల్ల..!
సాక్షి, గుంటూరు : ప్రభుత్వ వైద్యశాలల నుంచి పసికందులను మాయం చేస్తున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి సృష్టించే ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులు, ఆ తరువాత మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లోని ప్రసూతి విభాగాల్లో పసికందులను ఎత్తుకెళ్తున్న ఘటనలు తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రైవేటు వైద్యశాలల్లో ప్రసవం భారంగా మారడంతో పేద, నిరుపేద గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ భద్రత డొల్లతనంగా ఉండటం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడటంతో బాలింతలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లోని ప్రసూతి విభాగం నిత్యం గర్భిణులు, బాలింతలతో కిటకిటలాడుతూ ఉంటుంది. బెడ్లు సరిపోక ఒక్కో మంచంపై ఇద్దరు చొప్పున పసి బిడ్డలతో పడుకోవాల్సి వస్తోంది. ఈ విభాగంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొంటు న్నాయి. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు పసికందులను ఎత్తుకెళ్లేందుకు తెగబడుతు న్నారు. జీజీహెచ్ ప్రసూతి విభాగంలో 2011- 2012లో గుర్తుతెలియని దుండగులు ఓ పసికందును ఎత్తుకెళ్లడం తీవ్ర సంచలనం కలిగించింది. దుండగుల జాడ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. గత నెలలో కారంపూడి మండలం పేటసన్నిగండ్ల గ్రామానికి చెందిన అనూరాధ అనే మహిళ జీజీహెచ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రత్తిపాడుకు చెందిన రెహమూన్ అనే మహిళ ఆ బిడ్డను ఎత్తుకెళ్లడంతో కలకలం రేగింది. వెంటనే బిడ్డ సహా సదరు మహిళ దొరకడంతో తల్లిదండ్రులు, అధికారులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా సోమవారం జీజీహెచ్ గైనకాలజీ వార్డు వద్ద రవితేజ అనే ఏడు నెలల బిడ్డను గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు తల్లి ధనలక్ష్మి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెల వ్యవధిలో జీజీహెచ్‌లో ఇద్దరు పసికందులను ఎత్తుకెళ్లిన సంఘటనలు జరగడంతో ప్రసూతి వైద్య విభాగంలోని గర్భిణులు, బాలింతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు.. బయటపడ్డ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం.. జీజీహెచ్‌లో 2010లో రూ. 14 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓ ఆపరేటర్‌ను నియమించి, ప్రతిరోజూ వీడియో రికార్డులను పరిశీలించేవారు. అయితే రానురాను ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవి పనికి రాకుండా పోయాయి. 2012లో బిడ్డ మాయమైంది. దీంతో ఉలిక్కి పడ్డ అధికారులు తిరిగి సీసీ కెమెరాలను బాగుచేయించారు. అయితే ఆపరేటర్ లేకపోవడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఆసుపత్రిలో ఎలాంటి సంఘటన జరిగినా గుర్తించలేని దుస్థితి ఏర్పడింది. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సైతం అప్రమత్తంగా లేకపోవడంతో సోమవారం మరో బిడ్డ మాయమైంది. ఆసుపత్రిలో గేట్పాస్, స్టేపాస్, విజిటింగ్ పాస్‌లంటూ డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. భద్రతను కట్టుదిట్టం చేస్తాం ... జీజీహెచ్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తాం. సోమవారం జరిగిన ఘటనపై ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసరావును విచారణకు ఆదేశించాం. ఆయన నివేదిక అందించగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాల ఆపరేటింగ్ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాం. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం. - డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్. -
విశాఖలో విజృంభిస్తున్న డెంగీ
-
హ్యూమరం: చికుబుకు రైలు
ప్రపంచమే ఒక రైల్వేస్టేషన్. ఎక్కేవాళ్లు ఎక్కుతుంటారు, దిగేవాళ్లు దిగుతుంటారు. ఎక్కాల్సిన రైలు ఎక్కకుండా, తమది కాని స్టేషన్లో కొందరు దిగుతుంటారు. ఎక్కడికెళ్లాలో తెలియకుండా కనపడిన ప్రతి రైలూ తమదేనని కొందరు కంగారు పడుతుంటారు. ఎవడెంత గోల చేసినా రైలు మాత్రం కూతకొచ్చి వెళుతూ ఉంటుంది. నా చిన్నప్పుడు రాయదుర్గంలో ఒక చిన్న రైల్వేస్టేషనుండేది. బళ్లారి నుంచి రోజుకోసారి మాత్రమే రైలొచ్చేది. వచ్చిన రైలు వచ్చినట్టే వెనక్కి వెళ్లేది. మార్చుకునే వీల్లేదు కాబట్టి ఇంజన్ వెనక్కి పరిగెత్తేది. వెనక్కి వెళ్లే రైలు చూడటం అదే మొదలు, ఆఖరు. రైలయినా, జీవితమైనా ముందుకే వెళ్లాలి తప్ప వెనక్కి కాదు. బ్రిటిష్ హయాంలో మొదటిసారి గుంతకల్లుకి రైలొచ్చినప్పుడు చుట్టుపక్కల పల్లెలన్నీ బళ్లు కట్టుకుని వెళ్లి చూశాయి. నిప్పులు మింగి పొగను వదిలే రైలును చూసి హడలి పరిగెత్తారట. ఇన్నేళ్ల తరువాత కూడా ఇంజన్లు మారాయే కానీ, రైళ్లేమీ మారలేదు. టైమ్‌కి రావు, పోవు. మా బంధువు ఒకాయనకి రైళ్లపైన మహా నమ్మకం. సాయంత్రం ఆరుగంటలకి రైలుంటే, నాలుగుకే స్టేషన్‌కి చేరుకుని కాలుగాలిన పిల్లిలా స్టేషనంతా తిరిగేవాడు. రైలొచ్చేసరికి ఒక్క దూకు దూకి సీట్లో కూచునేవాడు. కదలగానే నిద్రపోయేవాడు. ఆయన దిగాల్సిన స్టేషన్లో తప్ప అన్ని స్టేషన్లలో మేల్కొని బోర్డులు వెతికేవాడు. తాడిపత్రిలో దిగాల్సినవాడు గుత్తిలో దిగి బస్సులు పట్టుకుని చచ్చీచెడి ఊరికొచ్చేవాడు. రిజర్వేషన్ బోగీలో మనుషులు కూడా రిజర్వ్డ్గానే ఉంటారు. జనరల్ బోగీలోనే వింతలూ విడ్డూరాలూ. ఒకర్నొకరు తోసుకుంటూ, ఒకరి నెత్తిన ఇంకొకరు కూడా కూచోవాల్సి వస్తుంది. ఇంత ఇరుకులో కూడా కొందరు పేకాడుతూ జోకర్ల కోసం వెదుకుతూ ఉంటారు. తమ సంచుల్ని ట్రంక్ పెట్టెల్ని ఇతరుల కాళ్లమీద పెట్టి, తమ కాళ్ల మీద తాము నిలబడేవారుంటారు. నరజల్మమిది అంటూ జీవన వేదాంతాన్ని బోధించే గాయకులు, చెనిక్కాయలు, బఠాణీలను పంటి కిందకి సరఫరా చేసే వర్తకులు, పాడేవాడికి లాభం, పాడనివాడిది లోభం అంటూ ఊరించే వేలం పాటదారులు, ప్రపంచాన్నంతా ఉచితంగా సందర్శించే సాధువులు... ఒకరా ఇద్దరా? జీవితంలో ఉన్న రంగులన్నింటినీ అద్దకంలో చూపించే కళాకారులు రైళ్లలో ఉంటారు. కోటీశ్వరులైనా సరే రైళ్లలోనే ప్రయాణించాలని రాసిపెట్టినవాళ్లు టికెట్ కలెక్టర్లు. రైలు మొత్తం మీద బూటేసుకునేవాళ్లు బోలెడు మందున్నా కోటేసుకునేది వాళ్లు మాత్రమే. మా ఫ్రెండ్ దగ్గర పెళ్లినాటి కోటు ఉండేది. డబ్బులు లేనప్పుడల్లా కోటేసుకుని రెలైక్కి నాలుగు రాళ్లు పోగు చేసేవాడు. ఒకరోజు అసలు కోటుకి ఎదురై రైలుకి బదులు జైలుకెళ్లాడు. పలక చేతికిచ్చి ఫొటో తీశారు. రైళ్లన్నీ ఒక్కలాగే ఉన్నా కొన్ని రైళ్లకు ఉత్సాహమెక్కువ. పట్టాలు దాటకుండా ప్రయాణించాలని చూస్తాయి. మనుషులైనా, రైళ్లయినా పట్టాలు దాటితే ప్రమాదమే! - జి.ఆర్.మహర్షి