India has asked its citizens living in Ukraine not to panic: రష్యా ఉక్రెయిన్‌ల ఉద్రిక్తల నడుమ రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉంచిందంటూ వరుస కథనాలు వస్తున్నాయి. ఓ పక్కన అమెరికా యుద్ధం తప్పదు అంటూ వరుస హెచ్చరికలు జారి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను వచ్చేయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారతీయ విద్యార్థులు సమయాత్తమయ్యారు కూడా.
అయితే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రజలకు విమానాలు అందడం లేదని ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతో కేంద్రం పౌరులను విమాన టిక్కెట్లు దొరకడం లేదని భయపడవద్దు మరిన్ని విమానాలను పంపిచేందుకు యత్నిస్తున్నాం అని తెలిపింది. అయితే ఉక్రెయిన్ నుండి భారతదేశానికి విమానాలు అందుబాటులో లేవని భారత రాయబార కార్యాలయానికి అనేక విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో భారత రాయబార కార్యాలయం "విద్యార్థులను భయాందోళనలకు గురికావద్దని, భారత్‌కు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న అనుకూలమైన విమానాలను బుక్ చేసుకోండి" అని ట్వీట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్‌వేస్ మొదలైనవి విమానాలను నడుపుతున్నాయి" పేర్కొంది. పైగా ఎయిర్ ఇండియా, ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా "సమీప భవిష్యత్తులో మరిన్ని విమానాలు నడిపేందుకు యత్నించనుందని కూడా వెల్లడించింది. అంతేకాదు ఏదైనా సమాచారం లేదా సహాయం కోసం భారత విదేశీ వ్యవహారాల మంతత్రిత్వ శాఖను సంప్రదించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం 24 గంటల హెల్ప్‌లైన్‌ని కూడా ఏర్పాటు చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరోవైపు రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత మాస్కో అధీనంలో ఉన్న క్రిమియాలో సైనిక కసరత్తులు ముగిశాయని, సైనికులు తమ స్థావరాలకు తిరిగి వస్తున్నారని తెలపడం విశేషం. కానీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. మాస్కో మరిన్ని బలగాల ఉపసంహరణను ప్రకటించినప్పటికీ రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ చుట్టూ మోహరించే ఉన్నాయని, సైనిక కసరత్తు కొనసాగుతోందని పేర్కొనడం గమనార్హం.
(చదవండి: ఉక్రెయిన్ ఉద్రిక్తతలు: భారతీయ విద్యార్థులకు చుక్కలు.. పరిస్థితి చెయ్యి దాటిందంటూ ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment