india Embassy
-
సిరియాలో దాడుల టెన్షన్.. భారత పౌరులకు హెచ్చరికలు జారీ
డెమాస్కస్: సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు విజృంభిస్తున్నారు. ప్రభుత్వ దళాలు చేతులెత్తేసిన కారణంగా నగరాలకు నగరాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిరియాలో ఉన్న వారందరూ డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తెలిపింది. వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది.సిరియాలో దాడుల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని తెలిపింది. అలాగే, ఇప్పటికే సిరియాలో ఉంటే తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అక్కడ ఉన్న వారంతా డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంలో టచ్‌లో ఉండాలని కోరింది. భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఇదే సమయంలో అత్యవసర సహాయం కోసం +963993385973, hoc.damascus@mea.gov.inను సంప్రదించాలని పేర్కొంది.ఇదిలా ఉండగా.. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగాయి. హోమ్స్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు హెచ్‌టీఎస్ ప్రకటించింది. హోమ్స్ కూడా ప్రభుత్వ దళాల చేతుల్లోంచి చేజారిపోతే, తిరుగుబాటుదళాల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉంది.Travel advisory for Syria:https://t.co/bOnSP3tS03 pic.twitter.com/zg1AH7n6RB— Randhir Jaiswal (@MEAIndia) December 6, 2024మరోవైపు తూర్పు సిరియాలో తుర్కియేకు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులు కూడా క్రియాశీలమయ్యారు. వారు ఇరాక్ సరిహద్దుల్లోని దేర్ ఎల్ జోర్ నగరాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. జోర్డాన్ సరిహద్దుల దగ్గర కూడా అధ్యక్షుడు అసద్ సేనలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పలు చెక్ పాయింట్ల నుంచి ప్రభుత్వదళాలు పారిపోయాయి. వీటిని స్థానిక సాయుధవర్గాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దక్షిణ ప్రాంతంలో డ్రూజ్ తిరుగుబాటుదారులు రెచ్చిపోతుండడం అసద్ బలగాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరియాతో తన సరిహద్దును జోర్డాన్ మూసివేసింది. -
సూడాన్‌లో యుద్ధవాతావరణం.. భారతీయులను హెచ్చరించిన ఎంబసీ
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో మరోసారి పరిస్థితి అదుపుతప్పింది. సూడాన్‌లో ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. వారు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. The Sudan Air Force in happier times putting on an air show over Khartoum - today these same planes may be launching unguided missiles into the city attacking paramilitary Rapid Support Forces (RSF) pic.twitter.com/kpJJrb1wG4 — James A. Tidmarsh (@jtidmarsh) April 15, 2023 వివరాల ప్రకారం.. సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం.. విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో, సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనంతరం, ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. మరోవైపు.. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో పౌరులు భయాందోళనలకు గురై వీధుల నుంచి పరుగులు పెట్టారు. NOTICE TO ALL INDIANS IN VIEW OF REPORTED FIRINGS AND CLASHES, ALL INDIANS ARE ADVISED TO TAKE UTMOST PRECAUTIONS, STAY INDOORS AND STOP VENTURING OUTSIDE WITH IMMEDIATE EFFECT. PLEASE ALSO STAY CALM AND WAIT FOR UPDATES. — India in Sudan (@EoI_Khartoum) April 15, 2023 ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమతమై.. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లకండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. తదుపరి అప్డేట్స్ కోసం ఎదురుచూడండి అని తెలిపింది. కాగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాడులు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 🚨🚨🚨 🇸🇩🇸🇩🇸🇩 RSF : fighters said they have taken control of Marawi airport. #Sudan#Sudan pic.twitter.com/tIp8gyzq3L — MT WORLD (@MTWORLDNEWS) April 15, 2023 SUDAN pic.twitter.com/SMaHudcPSF — Nuradinsaidmohamed (@Nuradinsaidmoh1) April 15, 2023 BREAKING: Planes on fire at Khartoum airport after coup attempt in Sudan pic.twitter.com/aWdyMv23xs — BNO News (@BNONews) April 15, 2023 #WATCH: Civilians trapped at #Khartoum international airport as #UAE-funded Rapid Support Forces besiege. The @_AfricanUnion & @AUC_MoussaFaki must respond now & build international support to curtail this incoming catastrophe. #Sudan pic.twitter.com/lxtnhLNRUR — Suldan I. Mohamed, MA (@SuldanMohamed_) April 15, 2023 -
భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!
India has asked its citizens living in Ukraine not to panic: రష్యా ఉక్రెయిన్ల ఉద్రిక్తల నడుమ రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉంచిందంటూ వరుస కథనాలు వస్తున్నాయి. ఓ పక్కన అమెరికా యుద్ధం తప్పదు అంటూ వరుస హెచ్చరికలు జారి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను వచ్చేయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారతీయ విద్యార్థులు సమయాత్తమయ్యారు కూడా. అయితే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రజలకు విమానాలు అందడం లేదని ట్విట్టర్లో పేర్కొంది. దీంతో కేంద్రం పౌరులను విమాన టిక్కెట్లు దొరకడం లేదని భయపడవద్దు మరిన్ని విమానాలను పంపిచేందుకు యత్నిస్తున్నాం అని తెలిపింది. అయితే ఉక్రెయిన్ నుండి భారతదేశానికి విమానాలు అందుబాటులో లేవని భారత రాయబార కార్యాలయానికి అనేక విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత రాయబార కార్యాలయం "విద్యార్థులను భయాందోళనలకు గురికావద్దని, భారత్‌కు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న అనుకూలమైన విమానాలను బుక్ చేసుకోండి" అని ట్వీట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్ మొదలైనవి విమానాలను నడుపుతున్నాయి" పేర్కొంది. పైగా ఎయిర్ ఇండియా, ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా "సమీప భవిష్యత్తులో మరిన్ని విమానాలు నడిపేందుకు యత్నించనుందని కూడా వెల్లడించింది. అంతేకాదు ఏదైనా సమాచారం లేదా సహాయం కోసం భారత విదేశీ వ్యవహారాల మంతత్రిత్వ శాఖను సంప్రదించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం 24 గంటల హెల్ప్‌లైన్‌ని కూడా ఏర్పాటు చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత మాస్కో అధీనంలో ఉన్న క్రిమియాలో సైనిక కసరత్తులు ముగిశాయని, సైనికులు తమ స్థావరాలకు తిరిగి వస్తున్నారని తెలపడం విశేషం. కానీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. మాస్కో మరిన్ని బలగాల ఉపసంహరణను ప్రకటించినప్పటికీ రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ చుట్టూ మోహరించే ఉన్నాయని, సైనిక కసరత్తు కొనసాగుతోందని పేర్కొనడం గమనార్హం. (చదవండి: ఉక్రెయిన్ ఉద్రిక్తతలు: భారతీయ విద్యార్థులకు చుక్కలు.. పరిస్థితి చెయ్యి దాటిందంటూ ఆవేదన) -
అఫ్ఘాన్‌లో విరుచుకుపడ్డ నలుగురు ముష్కరులు
-
భారత కాన్సులేట్ పై ఉగ్రదాడి
అఫ్ఘాన్‌లో విరుచుకుపడ్డ నలుగురు ముష్కరులు ఎదురు కాల్పుల్లో హతం, సిబ్బంది క్షేమం ఖండించిన ప్రణబ్, మన్మోహన్, మోడీ మోడీకి కర్జాయ్ ఫోన్, విచారణకు హామీ అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హెరాత్ ప్రావిన్సులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే భారత రాయబార కార్యాలయంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ల వంటి భారీ మారణాయుధాలతో నలుగురు ముష్కరులు తెల్లవారుజామున ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో పాటు బాంబుల వర్షం కురిపించారు. తొమ్మిది గంటల సుదీర్ఘ ఎన్కౌంటర్ అనంతరం ఒకరు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జరిపిన కాల్పుల్లో, మిగతా ముగ్గురు అఫ్ఘాన్ సిబ్బంది కాల్పుల్లో హతమయ్యారు. కాన్సులేట్ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్టు అఫ్ఘాన్‌లో భారత రాయబారి అమర్ సిన్హా తెలిపారు. దాడి సమయంలో అందులో తొమ్మిది మంది భారతీయులతో పాటు స్థానిక సిబ్బంది కూడా ఉన్నారన్నారు. దాడికి ఇంకా ఏ గ్రూపూ బాధ్యత ప్రకటించుకోకున్నా, ఇది పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్ర తండాల పనేనని భారత్ అనుమానిస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించిన నేపథ్యంలో అవి ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు దిగి ఉంటాయని భావిస్తోంది. దీన్ని అఫ్ఘాన్ సరిహద్దులకు ఆవలి నుంచి జరిగిన దాడిగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కూడా అభివర్ణించడం గమనార్హం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్, మోడీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దీటుగా తిప్పి కొట్టి ముష్కరులను తుదముట్టించిన భారత, అఫ్ఘాన్ భద్రతా దళాలను వారు ప్రశంసించారు. తొమ్మిది గంటల దాడి సందర్భంగా ఏ సమయంలోనూ ధైర్యం కోల్పోని కాన్సులేట్ సిబ్బందికి జోహార్లంటూ కొనియాడారు. అఫ్ఘాన్‌కు భారత్ అందిస్తున్న సాయాన్ని ఇలాంటి ఉదంతాలు అడ్డుకోజాలవని ప్రణబ్ స్పష్టం చేశారు. దేశ భద్రతకు హాని తలపెట్టజూసే ఇలాంటి కుయత్నాలకు తగిన జవాబు చెప్పేలా నిత్యం సన్నద్ధంగా ఉండాల్సిందిగా భారత భద్రతా దళాలకు ఆయన పిలుపునిచ్చారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మోడీతో ఫోన్లో మాట్లాడారు. దీన్ని ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అఫ్ఘాన్‌లోని భారత కార్యాలయాల పరిరక్షణకు పూర్తి చర్యలు చేపట్టడమే గాక దాడిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఆయనకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్ఘాన్‌తో స్నేహానికి, ఆ దేశ పునర్నిర్మాణానికి, శాంతి, సుస్థిరతల స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత రాయబార కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని కర్జాయ్ తనకు హామీ ఇచ్చినట్టు ట్విట్లర్లో మోడీ పేర్కొన్నారు. దాడిపై అఫ్ఘాన్‌లోని భారత రాయబారి అమర్ సిన్హాతో మాట్లాడారు. ఉగ్ర దాడులను ఎదుర్కొనే విషయంలో సంబంధిత విభాగాల మధ్య సమన్వయం తదితరాలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు శుక్రవారం సమీక్షించారు. హెరాత్ ప్రావిన్సులో సల్మా హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ వంటి పలు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టింది. అఫ్ఘాన్‌లోని మన రాయబార కార్యాలయాలపై గతంలో జరిగిన ఉగ్ర దాడులు 2007 జూలై 7: జలాలాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి. 41 మంది మృతి 2008 జూలై 7: కాబూల్ కార్యాలయంపై దాడి. 66 మంది మృతి 2008 జూలై 9: జలాలాబాద్ కార్యాలయంపై దాడి. ఇద్దరు భారతీయులతో పాటు ఆరుగురి మృతి 2009 అక్టోబర్ 8: కాబూల్ కార్యాలయంపై దాడి. 17 మంది మృతి 2010 ఫిబ్రవరి 26: కాబూల్ కార్యాలయంపై దాడి 2013 ఆగస్టు 3: జలాలాబాద్ కార్యాలయంపై దాడి. ఎనిమిది మంది పిల్లల మృతి