శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో యాత్రికులు, సందర్శకులను వెనక్కిరావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం భద్రతా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో కశ్మీర్‌లో భయాందోళనలు అలుముకున్నాయి. ప్రభుత్వ సూచనతో అమర్‌నాథ్ యాత్రికులు, సందర్శకులు తమ స్వస్ధలాలకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు, యాత్రికులు సైతం ఇంటిబాట పట్టారు. మరోవైపు జమ్ము కశ్మీర్ పరిణామాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. వదంతులను నమ్మరాదని రాజకీయ పార్టీల నేతలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ యాత్రికులు, సందర్శకులు, కార్మికులు, విద్యార్ధులు, క్రికెటర్లను ఖాళీ చేయిస్తూ ఉద్దేశపూర్వకంగా భయోత్పాతాన్ని సృష్టిసున్నారని, కశ్మీరీలకు భద్రత, ఊరట కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని అన్నారు. మానవతావాదం, కశ్మీరియత్‌లు ఎక్కడకు పోయాయని ఆమె ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment