Inter Student Commits Suicide In Hyderabad Quthbullapur, Details Inside - Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌లో సీటు సాధించాలనే కోరిక.. ఆ ఒత్తిడితోనే..

Published Tue, Jan 3 2023 3:12 PM | Last Updated on Tue, Jan 3 2023 6:18 PM

Student suicide Suspicious in Quthbullapur, Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమానాస్పదంగా ఓ ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల డివిజన్‌ దండమూడి ఎన్‌క్లేవ్‌లో నివాసముండే శ్రీరామదుర్గాప్రసాద్, అరుణ దంపతుల కుమార్తె శ్వేత(17) మారేడ్‌పల్లిలోని చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది.

ఈ నెల 1వ తేదీ రాత్రి 9.30 గంటలకు శ్వేతతో కలిసి అరుణ బెడ్రూమ్‌లో నిద్రించింది. 2న ఉదయం 5.30 గంటలకు నిద్ర లేచి చూసేసరికి కుమార్తె కనిపించలేదు. అయితే స్టడీరూమ్‌లో చదువుకుంటోందని వెళ్లి చూడగా శ్వేత చున్నీతో సీలింగ్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.

దీంతో కుటుంబ సభ్యులు యువతిని కిందికి దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించాలనేది తన కుమార్తె కోరికని, ఆ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

చదవండి: (ఎయిర్‌ ఇండియాకు జరిమానా)

►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement